పోలవరం ప్రాజెక్టును పూర్తిగా నాశనం చేసిన తర్వాత ఆకులు పట్టుకున్న చందంగా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. పనులు చేస్తున్న సంస్థల్ని అడ్డగోలుగా ఆపేసి కాంట్రాక్టులు రద్దు చేసి తరిమేసి.. ఇప్పుడు మొత్తం పాడైపోయాక.. ప్లీజ్ మళ్లీ వచ్చి పనులు చేయమని బతిమాలుతోంది. పోలవరం ప్రాజెక్టు అత్యంత క్లిష్టమైన డిజైన్ తో కూడుకున్నది. ఈ ప్రాజెక్టులో డయాఫ్రం వాల్ అత్యంత కీలకం. ఇది భూమి లోపల ఉంటుంది.
గతంలో జగన్ రెడ్డి పోలవరం వైపు వెళ్లి… తనకు డయాఫ్రం వాలే కనిపించలేదని.. అక్కడ పనులేమీ జరగడం లేదని స్టేట్మెంట్ ఇచ్చారు. పోలవరం గురించి తెలియని వాళ్లంతా అది నిజమే అనుకున్నారు. కానీ డయాఫ్రం వాల్ నిర్మాణం సగానికి పైగా అప్పటికే పూర్తయింది. తర్వాత జగన్ రెడ్డి మాటల్ని నమ్మి ఓట్లేశారు. వెంటనే జగన్ రెడ్డి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని నిలిపి వేసి కాంట్రాక్టర్ ను మార్చేశారు. ఆ కాంట్రాక్టర్ కు ఎత్తిపోతల మోటార్ల ప్రాజెక్టులు కట్టడంలో మాత్రమే అనుభవం. డయాఫ్రంవాల్ గురించి అసలేం తెలియదు.
టీడీపీ హయాలో డయాఫ్రం వాల్ నిర్మాన్ని బావర్ అనే జర్మనీ సంస్థ చేపట్టింది. ఆ సంస్థను తరిమేయడంతో వెళ్లిపోయింది. కానీ తర్వాత ఏం చేయాలో మేఘాకు తెలియకపోవడంతో ఎక్కడిదక్కడ ఆగిపోయింది. ఫలితంగా డయాఫ్రం వరాల్ రెండు, మూడుచోట్ల దెబ్బతిన్నది. అది బాగు చేయడం సమస్యగా మారింది. ఏదో ఒకటి చేయాలంటే మేఘాకు చేతకాదు. చివరికి బావర్ సంస్థనే ప్రభుత్వం సంప్రదిస్తున్నట్లుగా తెలుస్తోంది. రిపేర్లు చేయాలని.. మిగిలిన పనులు పూర్తి చేయాలని అడుగుతున్నారు. మొత్తంగా రూ. ఎనిమిది వందల కోట్ల పనులను వారికి అప్పగించనున్నారు. మరి మేఘాకు కాంట్రాక్ట్ ఎందుకు.. కమిషన్ల కోసమా అన్నది తేలాల్సి ఉంది.