ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురందేశ్వరి బాధ్యతలు స్వీకరించారు. ఏదో కొత్త వ్యూహంతోనే ఆమెను హైకమాండ్ అధ్యక్షురాలిగా నియమించి ఉంటుందని అనుకున్నారు. ఆమె మెదటి స్పీచ్ లో పూర్తిగా వైసీపీ సర్కార్ ను టార్గెట్ చేశారు. కీలకమైన ఆరోపణల్ని చేశారు. పొత్తుల విషయంలోనూ క్లారిటీ ఇచ్చారు. దీంతో బీజేపీ వ్యూహం ఏమిటో చూచాయగా క్లారిటీ వచ్చిందన్న అభిప్రాంయ వినిపిస్తోంది.
ఏపీలో భారీ లిక్కర్ స్కాం జరుగుతోంనది.. నాణ్యతలేని మద్యంతో ప్రజల ప్రాణాలు తీస్తున్నారని .. పాతిక శాతం మద్యం అమ్మకాలకు బిల్లులు ఉండటం లేదని.. ఇదంతా తాడేపల్లి ప్యాలెస్ కో వెళ్తోందన్నారు. ఇసుకను కూడా ఒక్కరే దోచుకుంటున్నారని.. మండిపడ్డారు. ఏపీలో శాంతి భద్రతల పరిస్థితలు.. ఇతర పాలనా వైఫల్యాలపైనా విరుచుకుపడ్డారు. ఇక కేంద్రం ఇచ్చిన నిధుల గురించీ రాష్ట్రాన్ని ప్రశ్నించారు.
పురందేశ్వరి డైరక్ట్ ఎటాక్ చేయడంతో బీజేపీ.. స్టాండ్ ఏమిటో క్లారిటీ వచ్చిందన్న అభిప్రాయం వినిపిస్తోంది. తెలుగుదేశం పార్టీని ఆమె ఒక్క మాట కూడా అనలేదు. అదే సమయంలో జనసేన పార్టీతో నిన్న నేడు కలిసే ఉన్నాం.. రేపు కూడా కలిసే ఉంటామని చెప్పారు. బీజేపీ వ్యూహకర్తలు.. పూర్తిగా వైసీపీనే టార్గెట్ చేసుకోవాలని దేశానిర్దేశం చేసి ఉంటారన్న అభిప్రాయం వినిపిస్తోంది.
పురందేశ్వరి కి పార్టీ నేతలు ఘనస్వాగత ఏర్పాట్లు చేశారు. గతంలో ఏ పార్టీ అధ్యక్షుడికీ ఇంత హడావుడి జరగలేదు. ఎయిర్ పోర్టు నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు.