మంచు మోహన్ బాబు తన వారసులకు ఆస్తిని పంచేశారా? ఎవరి వాటా వాళ్లకు సెటిల్ చేసేశారా? అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఈరోజు ఉదయం మోహన్‌బాబు రిజిస్ట్రేషన్ పనిమీద షాద్ నగక్ వెళ్లారు. అక్కడ ఆయనకు కొన్ని విలువైన ఆస్తులున్నాయి. అవన్నీ తన ఇద్దరు కొడుకుల పేర్లు మీద బదలాయించారని టాక్. మోహన్ బాబు.. ఆస్తిని పంచడం ఇదే తొలిసారి కాదు. ఇది వరకు తన ఆస్తుల్ని తన ముగ్గురు పిల్లలకు రాసిచ్చారు. ఫిల్మ్‌నగర్‌లో మోహన్ బాబుకి ఓ ఇల్లు ఉంది. అది కుమార్తె మంచు లక్ష్మికి రాసిచ్చారు. తిరుపతిలో ఉన్న ఆస్తుల్ని విష్ణుకి ఇచ్చారు. హైదరాబాద్ శివార్లలో ఉన్న ఫ్లాటుని మనోజ్ పేరు మీద బదలాయించారు. అప్పటికీ మోహన్ బాబు పేరుమీద ఇంకొన్ని ఆస్తులు మిగిలాయి. వాటిని ఇప్పుడు క్లియర్ చేసినట్టు తెలుస్తోంది. ఆమధ్య విష్ణు, మనోజ్‌ల మధ్య గలాటా జరిగింది. మీడియాకు మనోజ్ స్వయంగా కొన్ని లీకులు అందించారు. ఆ విషయాన్ని ఆ తరవాత రియాలిటీ షో పేరుతో కప్పిపుచ్చాలని చూశారు. కానీ.. కుదర్లేదు. ఆ వివాదాల వల్లే.. మోహన్ బాబు ఇప్పుడు తన వారసులకు ఆస్తి పంచి ఫైనల్ సెటిల్మెంట్ చేశారని తెలుస్తోంది. కొసరు విషయం ఏమిటంటే… షాద్ నగర్ రిజిస్ట్రేషన్ కార్యాలయం దగ్గర టీవీ ఛానళ్లు చుట్టిముడితే వాళ్ల మీద మోహన్ బాబు ఫైర్ అయ్యారు. బుద్ది లేదా? మీ ఉద్యోగాలు ఊడపీకుతా.. అంటూ పరుషంగా మాట్లాడారు. అసలు విషయం ఎక్కడ చెప్పాల్సివస్తుందో అని మోహన్‌బాబు అక్కడ రివర్స్ గేర్‌లో వెళ్లి మీడియా ముందు ముందే ఫైర్ అయ్యారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.