అప్పులు చేయడం కాదు.. అందులోనూ స్కాంలు చేయడం.. ఏపీ ప్రభుత్వ స్టైల్ మారింది. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పయ్యావుల కేశవ్… గురువారం బయటపెట్టిన వివరాలు .. ఆర్థమైన వారికి ఎవరికైనా మైండ్ బ్లాంక్ అయిపోతుంది. అప్పలు చేసి ఇలా అడ్డగోలుగా వందల కోట్లు దోచుకోవచ్చా అని సామాన్యుడు ఆశ్చర్యపోతాడు.
రాయలసీమలో కరువు నివారిస్తాం అని ఓ కార్పొరేషన్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ కార్పొరేషన్ పేరుతో… ఓ ప్రాజెక్టును కడుతున్నామని రుణం కావాలని పవర్ ఫైనాన్స్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ఫైనాన్స్ కంపెనీ కి లోన్ కావాలని అడిగారు. ప్రాజెక్టు కట్టేశామని.. అందులో ఎలక్ట్రికల్ పనులు చేశామని.. బిల్లులు చెల్లించాలని లోన్ కావాలని దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చింది. ఆ లోన్ నేరుగా కాంట్రాక్టర్ కు చెల్లించారు. అంటే ప్రభుత్వ ఖాతాలోకి రాకుండా నేరుగా కాంట్రాక్టర్ కు రూ. 900 కోట్లు చెల్లించారు. ఇదే పెద్ద అక్రమం అయితే.. అసలు అక్కడ పనులే చేయకపోవడం అతి పెద్ద స్కాం. ఇప్పుడీ లోన్ ను ప్రభుత్వ ఖాతాల నుంచి చెల్లిస్తున్నారు.
ఇది నీటి బిందువు లాంటిదని.. ఇలాంటి అప్పుల ఘోరాలు ఎన్ని చేశారో అన్ని వివరాలు బయటపెడతానని …పయ్యావుల అంటున్నారు. లోన్ ఇచ్చే వారికి అక్రమంగా కమిషన్లు ఇచ్చి వారితోనూ తప్పుడు పనులు చేయిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముందు ముందు ఈ అప్పుల స్కాం పుట్ట బద్దలయ్యే అవకాశాలు ఎక్కువగ ాఉన్నాయి.