మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ జైల్లో ఉంటున్న సుకేష్ చంద్రశేఖర్ అనే క్రిమినల్.. కేజ్రీవాల్, కవితల్ని టార్గెట్ చేసుకుని ప్రతి రెండు వారాలకూ ఓ లేఖ రిలీజ్ చేస్తూంటారు. తాను వారికి బ్లాక్ మనీ ఇచ్చానని వాట్సాప్ చాట్స్, ఇతర ఆధారాలు బయట పెడుతూ ఉంటారు. ఈ సారి ఆయన మరో కొత్త పేరును తన లేఖలో చేర్చారు. ఆ పేరు కేటీఆర్. లేఖ రాసింది కూడా ఈ సారి మీడియాకో.. మరొకరికో కాదు.. తెలంగాణ గవర్నర్‌కి. అసలే తెలంగాణ గవర్నర్ తమిళిశై.. బీఆర్ఎస్ సర్కార్ లో తప్పులు ఎక్కడ దొరుకుతాయా అని చూస్తున్నారు. ఇప్పుడు సుకేష్ ఆమెకే లేఖ రాయడం.. దాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తండటం హైలెట్ అవుతోంది.
తనత వద్ద ఉన్న ఆధారాలు ఇవ్వాలని కవిత, కేటీఆర్ తరపు సన్నిహితులు ఒత్తిడి తెస్తున్నారని.. ఆధారాలు ఇస్తే రూ.100 కోట్ల నగదు, శంషాబాద్ వద్ద భూమి, అసెంబ్లీ సీట్ ఇస్తామని ఆశపెడుతున్నారని సుకేష్ చెప్పుకొచ్చారు. దాదాపు 200 కోట్ల రూపాయల లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయన్నారు. కవితకు నాకు మధ్య జరిగిన వాట్సాప్ చాట్ అంతా రికార్డింగ్ ఉందన్నారు. మొత్తం ఈడీకి ఇచ్చేశానని సీబీఐ విచారణ జరిపించాలని కోరుతున్నారు.
ఈ అంశంపై కేటీఆర్ ట్విట్టర్లో ఘాటుగా స్పందించారు. సుఖేష్‌పై తిట్ల దండకం అందుకున్నారు. ఇలాంటి వ్యక్తి గురించి తాను ఎప్పుడూ వినలేదన్నారు. అతనిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటాననని ప్రకటించారు. నోటెడ్ క్రిమినల్స్ ఇలాంటి ఆరోపణలు చేసనప్పుడు ప్రచారం చేసేటప్పుడు, పబ్లిష్ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. సుకేష్ తొలి సారి కేటీఆర్ ప్రస్తావన తెస్తూ లేఖ రాయడం వెనుక ఏదైనా కుట్ర ఉందా అని బీఆర్ఎస్ నేతలు కంగారు పడుతున్నారు.