ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ కొత్త పలుకులో రాసే విషయాలు కంటే.. వాటి వెనుక ఉండే గూడార్థాలు ఎక్కువలా ఉంటాయి. ఆ రాతల నుంచి ఆయన ఓ ప్రత్యేకమైన లక్ష్యాన్ని ఎంచుకుంటారు. అది టార్గెటెడ్ పీపుల్కే తెలుస్తుంది. ఈ వారం కూడా ఆయన అదే సందేశాన్ని తన కొత్త పలుకు ద్వారా పంపారు. ఏపీలో జరుగుతున్న వాలంటీర్ల వివాదాన్ని.. వైసీపీనే సృష్టిచిందని.. దాన్ని పెంచి పెద్ద చేస్తోంది కూడా ఆ పార్టీనేనని అంటున్నారు. ఎదుకంటే.. పవన్ కల్యాణ్ ను ఒంటరి పోటీ కోసం వెళ్లేలా చేయడం.
వైసీపీ చేసేది ఎక్కువగా మైండ్ గేమ్ రాజకీయాలు. ఎదుటి వ్యక్తుల వ్యక్తిత్వాన్ని… ఆలోచనల్ని.. దూకుడును బట్టి రాజకీయాలు చేస్తూంటారు. విలువలు పాటించే నేతల్ని వైసీపీ ఎలా వేటాడుతుందో ఇప్పటికే చూశారు. పవన్ కల్యాణ్ లో ఉన్న ఆవేశాన్ని వైసీపీ తనకు అనుకూలంగా మల్చుకుని ఆయనను ఒంటరి పోటీ లేదా బీజేపీతో మాత్రమే కలిసి పోటీ చేసేలా రెచ్చగొట్టడమే .వైసీపీ లక్ష్యంగా రాజకీయాలు చేస్తోందని అంటున్నారు. పవన్ కల్యాణ్ మాటలకు.. వైసీపీ ఓవర్ రియాక్షన్ చెబుతోంది ఇదేనని ఆయన అంటున్నారు.
అదే సమయంలో వైసీపీ క్యాడర్ నూ.. ఇక మీరెందుకు అన్న ప్రశ్న వేశారు. జగన్ రెడ్డి అధికారంలోకి రావడానికి అందర్నీ ఉపయోగించుకున్నారని.. వచ్చే ఎన్నికల్ల గెలవడానికి వారెవరికినీ ఉపయోగించుకోవడం లేదని.. పూర్తిగా వాలంటీర్ల మీదనే ఆధారపడబోతున్నారని అంటున్నారు. జగన్ రెడ్డి కేవలం వాంటీర్ల మీదనే ఆధారపడతారనేది… ఆర్కే చెప్పే విషయం. ఇప్పటికే వైసీపీ క్యాడర్ లో దీనిపై తీవ్ర అసంతృప్తి ఉంది. దీన్ని మరింత పెంచడానిక ఆయన పరోక్షంగా ఉపయోగించుకున్నారు.
ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి నిర్మోహమాటంగా సపోర్ట్ చేస్తున్న ఆర్కే… రేవంత్ మాటల వల్ల… కాంగ్రెస్ పార్టీకి నష్టం కలుగలేదు కానీ.. ఆయన నోటిపై అదుపు లేదని .. జాగ్రత్తగా ఉండాలని కవర్ చేసే ప్రయత్నం చేశారు. ఆర్కే.. తన పత్రిక విధానం ఏదైనప్పటికీ.. తాను మాత్రం తన ఆర్టికల్స్ ద్వారా.. తాను సపోర్ట్ చేసే పార్టీలకు రాజకీయ మేలు జరిగేలా మాట సాయం చేయడంలో మాత్రం ఎప్పుడూ ముందు ఉంటారు.