ప్రజాధనం దోపిడీలో.. ముఖ్యంగా అప్పులు తీసుకు వచ్చి మరీ దోపిడీ చేయడంలో ఏపీ ప్రభుత్వం ప్లాన్ మైండ్ బ్లోయింగ్ గా ఉంది. పదిన్నర శాతానికి వడ్డీ తెచ్చి చేయని పనులకు బిల్లులు చెల్లించేశారు. ఈ స్కాంకు ఉపయోగించుకున్న పేరు రాయలసీమ. కృష్ణానది నుంచి నీటిని ఎత్తి పోస్తానంటూ.. . జగన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఓ ఎత్తిపోతల ప్రాజెక్ట్ చేపట్టారు. ఓ అనుమతి.. పాడు ఏమీ లేకుండా మేఘాకు కాంట్రాక్ట్ ఇచ్చేశారు. అలా పనులు చేస్తే.. ఆపేయాల్సి వస్తుందని తెలుసు. కానీ అసలు లక్ష్యం ప్రాజెక్టును కట్టడం కాదు. డబ్బులు దోచేయడం. అందుకే అనుమతులు లేని కారణంగా నిలిపివేయాల్సి వచ్చింది. కానీ వారి లక్ష్యాన్ని నెరవేర్చుకున్నారు.. డబ్బులు కొట్టేశారు .
రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు కింద ఎలాంటి పనులు చేపట్టకుండానే… రూ. 738 కోట్లను మేఘా సంస్థకు చెల్లించేశారు. ఇది కూడా కేంద్ర సంస్థలు అయిన రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ల నుంచి అప్పు తెచ్చి చెల్లించారు. పనులు చేసినట్లుగా నివేదిక ఇచ్చి మరీ అప్పులు తెచ్చారు. ప్రభుత్వ ఖజానాలో చూపించకుండా నేరుగా కాంట్రాక్టర్ కే చెల్లించాలి. విద్యుత్ పనులు చేసినట్లుగా చూపించి కొట్టేశారు. ఇప్పుడు పర్యావరణ అనుమతులు.. ఇతర అనుమతులు వచ్చే వరకూ పనులు జరగవు. కానీ ఆ డబ్బులు మాత్రం కాంట్రాక్టర్ కు చేరిపోయాయి. అక్కడ్నుంచి ఇదంతా చేసినందుకు ఎంత కమిషన్ ముట్టిందో వారికే తెలియాలి.
అయితే ఇలా దోపిడీ చేయడానికి సీమ ప్రజల్ని ఘోరంగా మోసం చేయడమే ఇక్కడ అసలు విషాదం. ప్రాజెక్టును చిత్తశుద్ధితో కట్టాలనుకుంటే… పద్దతి ప్రకారం కట్టి కోర్టుల నుంచి ఇబ్బందులు రాకుండా చూసుకునేవారు. కానీ ఆపేసి డబ్బులు మొత్తం నొక్కేయాలనుకున్నారు కాబట్టే ఇదంతా చేశారు. డబ్బులు నొక్కేశారు. ఇంతకు ముందే రాయలసీమ పేదల ఇళ్లను రద్దు చేసి. .. అమరావతిలో కేటాయింప చేసుకున్నారు. ఇప్పుడు ఇది… మొత్తంగా రాయలసీమ ప్రజలనోట్లో మట్టి కొడుతోంది ప్రభుత్వం.