పవన్ కల్యాణ్ ఎన్డీఏలో భాగస్వామి అని బీజేపీ తొలి సారి గుర్తించింది. ఎన్డీఏ పార్టీల సమావేశానికి ఆహ్వానించింది. ఇన్ని రోజులూ పట్టించుకోలేదు.. ఇప్పుడు వెళ్లాలా వద్దా అని ఆలోచించి చివరికి పవన్ … పెద్దవాళ్లు పిలిచినప్పుడు వెళ్లడమే సంప్రదాయం అని. .. రెడీ అయ్యారు. ఆ సమావేశంలో ఏదో జరుగుతుందని కాదు కానీ.. పవన్ కల్యాణ్ ను ఇంత కాలం అవమానించి ఇప్పుడు ఎందుకు దగ్గర తీసుకుంటున్నారన్నదే జనసైనికులకు సైతం అర్థం కాని ప్రశ్న.
బీజేపీతో జనసేన పార్టీ పొత్తు పెట్టుకున్న తర్వాత… పార్టీగా గుర్తించిన సందర్భాలు తక్కువ. ఎనిమిదేళ్ల వరకూ మోదీ అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదు. అయితే పొత్తులు పెట్టుకున్న తర్వాత బీజేపీ రహస్య మిత్రుడు వైసీపీ కోసం పవన్ కల్యాణ్ ను నియంత్రించింది కానీ… పార్టీ బలోపేతానికి చేసిందేమీలేదు. అసలు కలిసి పని చేయడానికి బీజేపీ ముందుకు రాలేదు . ఎప్పుడూ రాష్ట్ర నాయకత్వం కూడా పవన్‌తో సంప్రదింపులు చేయలేదు. వారు వైసీపీ నాయకత్వంతో టచ్ లో ఉండటంతో సమస్యలు వచ్చాయి.
ఇటీవల ఓ సమావేశంలో.. బీజేపీ సీరియస్ గా ఉండి ఉంటే… వేరే పార్టీతో పొత్తుల గురించి ఆలోచన చేసే అవసరం ఉండేది కాదని పవన్ వ్యాఖ్యానించారు. ఇందులో కొంత నిజం కూడా ఉంది. కన్నా లక్ష్మినారాయణ ఏపీ బీజేపీ చీఫ్ గా ఉన్నప్పుడు ప్రభుత్వం పోరాడారు. హడావుడిగా ఆయనను తొలగించి… సోము వీర్రాజును నియమించారు. జనసేన పార్టీ ఇప్పటికీ బీజేపీతో కలిసి పని చేయడం లేదు. పొత్తులో ఉన్నామని బీజేపీ చెప్పుకుంటోంది. ఈ కారణంగానే ఎన్డీఏ సమావేశానికి పిలువగానే వెళ్తున్నారు. మరి బీజేపీ పవన్ ను అవసరానికే ఉపయోగిచుకుంటుందా… రాజకీయంగా ఇరువురికి ఉపయోగపడే కార్యక్రామలు ఏమైనా చేపడుతుందా అన్నదే కీలకం.