యువగళం పాదయాత్ర వైసీపీ నేతలకు దడ పుట్టిస్తూనే ఉంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా.. అంతకు మించి అన్నట్లుగా పాదయాత్ర సాగుతోంది. ప్రకాశం జిల్లాలో వైసీపీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. దీంతో అరిగిపోయిన పాత వ్యూహాన్ని కొత్తగా ఇంప్లిమెంట్ చేద్దామని ప్రయత్నించి.. నవ్వుల పాలవుతున్నారు. ఒంగోలులో అసలు ఎవరు పెట్టారో తెలియకుండా.. కొన్ని ప్లెక్సీలను పెట్టారు. జూనియర్ ఎన్టీఆర్ నెక్ట్స్ సీఎం అయినా.. అసలు వాడు వచ్చే వరుకు కొసరు వాడికి పండగేనని క్యాప్షన్ అందులో పెట్టారు. అది టీడీపీ వాళ్లే పెట్టారు అనిపించేలా ఉండటానికి చంద్రబాబు, ఎన్టీఆర్ ఫోటోలు కూడా పెట్టారు.
ఇలాంటివి ముందే పెడతారేమో తెలుసన్నట్లుగా కొన్ని మీడియా సంస్థలు.. ఇవి ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఎన్టీఆరే్ పెట్టించారన్నట్లుగా హడావుడి చేశారు. కానీ బహిరంగంగా ఫ్లెక్సీలు పెడితే.. ఎక్కడ ప్రింట్ చేయించారు..ఎవరు చేయించారో.. తెలుసుకోవడం గంటలో పని. అనుకున్నట్లుగానే టీడీపీ నేతలు విషయాన్ని బయట పెట్టారు. బాలినేని ప్రణీత్ రెడ్డి .. తన అనుచరులతో ఈ పని చేయించారని తేలిపోయింది. దీంతో వైసీపీ నేతల పరువు పోయినట్లయింది. వాళ్లే ఈ సారి జగన్ రెడ్డి సీఎం కారని చెప్పినట్లయింది.
జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పేరుతో వైసీపీ నేతలే తరచూ హడావుడి చేస్తూంటారు. ఎవరు చేస్తారో చెప్పుకోరు .. కానీ జూనియర్ పేరుతో మాత్రం ఇష్టం వచ్చినట్లుగా ఫ్లెక్సీలు వేయడం.. నినాదాలు చేయడం చేస్తూంటారు. వైసీపీ నేతల తీరు చూస్తూంటే.. లోకేష్ ను ఎదుర్కోవడం జగన్ రెడ్డి వల్ల కావడం లేదని.. ఎన్టీఆర్ రావాల్సిందే అన్నట్లుగా ఉందని సెటైర్లు పడుతున్నాయి. ఐ ప్యాక్ చీప్ ట్రిక్స్ తో పరువు పోగొట్టుకోవడం తప్ప.. చేసేదేముందని.. డైరక్ట్ పాలిటిక్స్ చేయలేమా అని వైసీపీ నేతలే మథనపడే పరిస్థితి వచ్చింది.