ఇటీవల వీసీల సమావేశం పెట్టిన జగన్ రెడ్డి యూనివర్శిటీల స్థాయిలో ఏఐను ఇంప్లిమెంట్ చేయాలని.. ప్రపంచంలోనే అంటే.. ఆక్స్ ఫర్డ్, స్టాన్ ఫర్డ్ కంటే మనమే ముందు ఉండాలని.. అదే తన కల అని చెప్పుకొచ్చారు. దీన్ని జాతీయ మీడియాలో ప్రమోట్ చేసుకున్నారు. కానీ రియాలిటీ మాత్రం యూనివర్శిటీలన్నీ అన్ని రకాల అక్రమాలకు కేంద్రాలుగా మారాయి. క్యాంపస్ లు అసాంఘిక శక్తులకు అడ్డాగా మారిపోయాయి. రాజకీయ కార్యకలపాలతో నిర్వీర్యం అవుతున్నాయి. దొరికినవాడే దొంగ అన్నట్లుగా.. ఏయూ.లో వ్యవహారాలన్నీ తాజాగా బయటపడుతున్నాయి.
సత్యనారాయణ అనే హిందీ ప్రోఫెసర్ తనకు హీహెచ్డీ రాకుండా చేస్తున్నారని.. లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఓ మహిళ జాతీయ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసింది. ఈ విషయం బయటకు రావడంతో సత్యనారాయణ మీడియా ముందుకు వచ్చి అసలు ఆ మహిళ ఎవరు… యూనివర్శిటీలో ఏం జరుగుతుందో వెల్లడించారు. ఆ మహిళ భర్త యూనివర్శిటీలో మద్యం వ్యాపారం చేస్తారట. ఆయనకు అర్హత లేకపోయినా ఓ ఉద్యోగం కల్పించారని అంటున్నారు. ఆయన పీహెచ్డీలు అమ్మి పెట్టే వ్యాపారం చేస్తున్నారని… ఇలా పధ్నాలుగు వందల పీహెచ్డీలు అమ్మకానికి ఉన్నాయని సత్యనారాయణ చెబుతున్నారు. తాను టాపిక్ అవ్వకపోయినా ఆయన భార్య.. హీహెచ్డీ చేసేసినట్లుగా సంతకం పెట్టమని ఒత్తిడి చేస్తే.. పెట్టనందుకే లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తున్నారని అంటున్నారు.
జగన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ప్రసాదరెడ్డి అనే వీసీ ఏయూని వైసీపీ ఆఫీస్ గా మార్చారనే ఆరోపణలు ఉన్నాయి. ఆయన తన స్థాయిలో తాను సంపాదించుకుంటూంటే.. ఇతరులూ అదే పని చేస్తున్నారని విద్యార్థి సంఘం నేతలు చాలా కాలంగా ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు బయటకు వస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఇంకెన్ని ఘోరాలు ఏయూ నుంచి బయటకు వస్తాయి. పాలకుడు .. క్రిమినల్ మైండ్ సెట్ తో.. అన్నింటినీ స్వార్థానికి వాడుకోవాలనుకుంటే… యూనివర్శిటీలు కూడా ఇలాగే తయారవుతాయి. చివరికి నష్టం జరిగేది యువతకే