చిరంజీవి – కల్యాణ్ కృష్ణ కాంబినేషన్లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. చిరు కుమార్తె సుస్మిత కొణిదెల నిర్మాత. ఈ చిత్రంలో సిద్దు జొన్నలగడ్డ కూడా నటిస్తున్నాడు. అయితే.. తన కాల్షీట్లు దొరకడం కష్టమైపోతోంది. ఎట్టిపరిస్థితుల్లోనూ చిరు సినిమా వదులుకోకూడదని సిద్దూ భావిస్తున్నాడు. సిద్దు జొన్నల గడ్డ డేట్స్ దొరక్కపోతే, మరో ఆప్షన్ ఏమిటన్న విషయంలోనూ దర్శకుడు ఓ స్పష్టతతోనే ఉన్నట్టు సమాచారం. ఆగస్టు నుంచి షూటింగ్ మొదలు కానుంది. అప్పటిలోగా సిద్దూ డేట్స్పై ఓ క్లారిటీ వచ్చేస్తుంది.
ఈ సినిమాలో చిరంజీవి పాస్ పోర్ట్ కార్యాలయంలో పని చేసే ఉద్యోగిగా కనిపిస్తాడని తెలుస్తోంది. ఈ తరహా క్యారెక్టర్ లో కనిపించడం చిరుకి ఇదే తొలిసారి. తన క్యారెక్టర్ క్లాసీ లుక్తో సాగబోతోందని తెలుస్తోంది. బ్రో డాడీ సినిమాకి ఇది రీమేక్ అని ప్రచారం జరుగుతోంది. అందులో ఏమాత్రం నిజం లేదు. ఇది పూర్తిగా కొత్త కథ. ఈ సినిమాలో చిరుకి జోడీగా త్రిష దాదాపుగా ఖాయమైంది. సిద్దు జొన్నలగడ్డ జోడీగా శ్రీలీలని ఎంచుకొన్నారు.