ఈమధ్య కాలంలో వచ్చిన చిన్న సినిమాల్లో పెద్ద హిట్టు కొట్టింది బేబీ. ఈ సినిమా తీసిన నిర్మాతకీ, కొన్న బయ్యర్లకూ డబ్బులే డబ్బులు. రోజు రోజుకీ వసూళ్లు పెరుగుతున్నాయే తప్ప, తగ్గడం లేదు. కుర్రాళ్లతో సినిమా హాళ్లు నిండిపోతున్నాయి. కాకపోతే… ఈ సినిమా తీసిన దర్శకుడు సాయి రాజేష్‌కి `బేబీ`పై కాస్త అసంతృప్తి ఉంది. ఇంకాస్త బెటర్‌గా తీసుండాల్సింది.. అంటూ తనని తాను రివ్యూ చేసుకొన్నాడు సాయి రాజేష్.
”నేను ఏ సీన్స్ దగ్గర ప్రేక్షకులు రియాక్ట్ కాకూడదు అనుకొన్నానో.. అక్కడే ఎక్కువ రియాక్ట్ అవుతున్నారు. చివరికి నా సినిమా అప్పల్రాజులా మారిపోయింది. హృదయకాలేయం సినిమాకి బౌండెడ్ స్క్రిప్టుతో సెట్ కి వెళ్లా. ఈ సినిమా అలా కాదు. బౌండెట్ స్క్రిప్టే లేదు. ఏ రోజు సన్నివేశాలు ఆ రోజు రాసుకొన్నా. సెట్ కి వెళ్లే ముందు ప్రాపర్టీ వచ్చేది. కానీ అలా చేయడం తప్పు. నిర్మాతలపై అదనపు భారం పడుతుంది. ఈ విషయంలో నేను ఇక ముందు ఇంకాస్త జాగ్రత్తగా ఉంటాను” అని వివరణ ఇచ్చుకొన్నాడు.
ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా బెడ్ రూమ్ సీన్‌పై. దీనిపై కూడా క్లారిటీ ఇచ్చాడు సాయి రాజేష్. ”బెడ్ రూమ్ సీన్స్ ని కూడా కొంతమంది తప్పుగా అర్థం చేసుకొన్నారు. ఆ సీన్లో అమ్మాయి బాధ పడుతుంది. అందుకే కంట్లోంచి నీరు కారుస్తుంది. అది ఎంజాయ్మెంట్ తో వచ్చిన కన్నీరు కాదు..” అని సమాధానమిచ్చాడు.