గత ప్రభుత్వం తీసుకు వచ్చిన లూలూ షాపింగ్ మాల్ ను తరిమేసి.. రూ. రెండు వేల కోట్ల పెట్టుబడుల్ని.. అవసరం లేదని గెంటేసిన జగన్ రెడ్డి సర్కార్.. ఎన్నికలకు ముందు తమ పాత ఖాతా రహేజాను ఏపీకి పిలిపించింది. విశాఖలో మాల్ కట్టాలని ఆఫర్ ఇచ్చింది. ఎంత భూమి ఇచ్చారు…ఎంతకు ఇచ్చారన్నది స్పష్టత లేదు. విశాఖలో రూ. ఆరు వందలకోట్ల పెట్టుబడితో మాల్ కట్టబోతున్నామని.. ఆ మాల్ శంకుస్థాపనకు రావాలని రహేజా పెద్దలు సీఎం జగన్ ను కలిసినట్లుగా ప్రభుత్వం ప్రకటించింది.
ఎన్నికలకు ముందు ఇదో కంటి తుడుపు చర్యగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అత్యంత ఖరీదైన స్థలాలను అతి తక్కువకు కట్టబెట్టి.. పెట్టుబడులు పెడుతున్నారని హోరెత్తించడం ఈ ప్రభుత్వం స్ట్రాటజీలో ఓ భాగంగా. కడప స్టీల్ ప్లాంట్ దగ్గర నుంచి అదానీ డేటా సెంటర్ వరకూ జరుగుతోందే. ఐదేళ్లలో ఒక్క పరిశ్రమ యూనిట్ నిర్మాణం కూడా ప్రారంభం కాలేదు. సీఎం జగన్ రెడ్డి మాత్రం కొన్నింటికి శంకుస్థాపనలు చేశారు. అవి కూడా.. ముందుకు సాగడం లేదు.
గతంలో కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు వెంకయ్యనాయుడు, సీఎం చంద్రబాబునాయుుడు తీవ్ర ప్రయత్నాలు చేసి.. విశాఖలో లూలూ మాల్ పెట్టుబడులు తెచ్చారు. రూ. రెండు వేల కోట్ల పెట్టుబడితో అత్యంత భారీ మాల్ ను నిర్మించేందుకు సిద్ధమయ్యారు. పనులు కూడా ప్రారంభమయ్యాయి. కానీ ప్రభుత్వం రద్దు చేసింది. ఆ భూముల్ని వైసీపీ నేతలు కబ్జా చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో రహేజా గ్రూప్ ను పిలిపించడం ఎన్నికలకు ముందు శంకుస్థాపన చేయనుండటం విశాఖ వాసుల్ని మోసం మచేయడానికేనని చెబుతున్నారు.