వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి .. అన్ని ముఖ్యపదవులు… ముఖ్యంగా అధికారం అనుభవించే పదవులన్నీ ఒకే వర్గం చేతుల్లో ఉన్నాయి. చివరికి డిప్యూటీ సీఎంల పేరుతో ఇతరులకు పదవులిచ్చినా వారి పనులు చేసేది రెడ్డి సామాజికవర్గం పెద్దలే. పదవులు పొందిన వారు నోరు తెరవడానికి కూడా పర్మిషన్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. చివరికి టీటీడీ చైర్మన్ పోస్టు కూడా నాలుగేళ్లుగా వైవీ సుబ్బారెడ్డి చేతిలో ఉంది. రెండో సారి ఆయన పదవి కాలం ముగియబోతోంది. ఆ తర్వాత ఓ బీసీ నేతలకు చాన్సివ్వాలని జగన్ అనుకుంటున్నారు.
అన్నిపదవుల్లో ఒకే సామాజికవర్గం అని తీవ్ర ఆరోపణలు వస్తున్న సమయంలో… ఎన్నికలకు ముందు ఇతర వర్గాలకు బిస్కెట్లు వేయాలని ఐ ప్యాక్ డిసైడయిందని చెబుతున్నారు. ఇక్కడ టిక్కెట్ల సర్దుబాటులో భాగంగా ఏ బీసీ నేతకు అన్యాయం చేయాలో చూసుకుని .. అలాంటి నేతకు ఆరు నెలల పాటు టీటీడీ చైర్మన్ పోస్టు ఇవ్వాలనుకుంటున్నారు. ఈ విషయంలో బీసీ విభాగానికి చీఫ్ గా ఉన్న జంగా కృష్ణమూర్తి సరిపోతారని.. లీకులిస్తున్నారు. ఆయనకు ఇస్తారో లేకపోతే.. మరో డబ్బులున్న బీసీ నేతను తెరపైకి తెస్తారో కానీ… చివరి ఐదారు నెలలు మాత్రం టీటీడీ చైర్మన్ గా బీసీ నేతను ఎంపిక చేయడం ఖాయమని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
రెండేళ్ల పదవి కాలానికి జీవో ప్రభుత్వం మారిన తర్వాత టీటీడీ చైర్మన్ కొనసాగలేరు. గతంలో టీడీపీ నియమించిన సుధాకర్ యాదవ్ ను అత్యంత ఘోరంగా వెంటాడి టార్చర్ చేసి మరీ రాజీనామా చేయించారు. వచ్చే ప్రభుత్వం అంత కంటే ఎక్కువ చేస్తుందన్న భయంతో… ఎవరున్నా తప్పుకోక తప్పదు. వైసీపీలో బీసీలకు… వేసే ఎర ఇలాగే ఉంటుందని.. మళ్లీ ఎన్నికల తర్వాత వారికి ఇచ్చిన కుర్చీలన్నీ లాగేసుకుంటారనే సెటైర్లు కామన్ గానే వినిపిస్తున్నాయి.