జగన్ రెడ్డి బటన్ నొక్కి చాలా కాలం అయింది. కానీ అమ్మ ఒడి డబ్బులు మాత్రం సగం మందికి ఇంకా పడలేదు. పిట్ట రెట్ట పడినట్లుగా ఎప్పుడు పడతాయో తెలియదని ఇప్పటికే సైటెర్లు వేసుకుంటున్నారు జనం. వీరికి షాకిచ్చేలా.. మొత్తం పదిహేను వేలు కాకుండా కేవలం తొమ్మిది వేలే కొంత మంది అకౌంట్లలో పడుతున్నాయి. దీంతో చాలా మంది కంగారు బ్యాంకులుకు పరుగెత్తి విషయం ఏమటా అని కనుక్కుంటున్నారు. బ్యాంకర్లు మాకేం తెలుసు.. జగనన్నను కనుక్కోండి అని చెప్పి పంపించేస్తున్నారు.
శ్రీకాకుళం జిల్లా కవిటి మండలంలో చాలా మందికి 9 వేలే జమ అయ్యాయి. రాష్ట్ర మంతటా రెండు రోజులనుంచి డబ్బులు జమ అయిన లబ్దిదారుల అందరి ఖాతాల్లోనూ ఇదే రీతిన రూ.9 వేలు పడినట్లు తెలుస్తోంది.ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి గత నెల 28న అమ్మఒడి నాల్గో విడత డబ్బుల జమ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 42,61,965 మంది తల్లుల ఖాతాల్లో రూ.6,392.94 కోట్లు జమ చేయనున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించారు. బటన్ కూడా నొక్కారు.
మూడు వారాలు గడిచినా ఇంకా లక్షలాది మందికి డబ్బులు జమకాలేదు. కొందరి తల్లుల బ్యాంకు ఖాతాల్లో బుధవారం డబ్బులు పడ్డాయన్న సమాచారంతో తమ ఖాతాల్లో నుంచి డబ్బులు తీసేందుకు బ్యాంకులకు వెళ్లారు. నగదు జమ చూసుకునే సరికి రూ.9 వేలే కనిపించడంతో వారు షాక్కు గురయ్యారు. అమ్మఒడి కింద ప్రభుత్వం ఈ ఏడాది రూ. 15వేలు ఇవ్వాల్సి ఉంది. కానీ స్కూల్ మెయింటనెన్స్ పేరు చెప్పి రెండు వేలు కోత వేస్తున్నారు. రూ.13 వేలు ఇస్తామన్నారు. బటన్ నొక్కిన నాలుగువారాలకు తొమ్మిదివేలు జమ చేస్తున్నారు. ఇదేంది అని అడిగితే ఎవరూ సమాధానం చెప్పడం లేదని వాపోతున్నారు.