బండి సంజయ్ తెలంగణ బీజేపీ చీఫ్‌గా ఉన్నప్పుడు ఆయనపై లేనిపోనివి హైకమాండ్‌కు చెప్పి ఆయనను తప్పించేదాకా ఫిర్యాదులు చేస్తూనే ఉన్న నేతగా రాజగోపాల్ రెడ్డి గురించి బీజేపీలో అందరికీ తెలుసు. అయితే ఇవాళ అదే రాజగోపాల్ రెడ్డి కిషన్ రెడ్డి కొత్త చీఫ్ గా బాధ్యతలు తీసుకునే సమయంలో చేసిన ఓవరాక్షన్ చూసి అందరూ నోరెళ్లబెట్టాల్సి వచ్చింది. బండి సంజయ్ ను పదవి నుంచి తప్పించిన తర్వాత ఆయనను చూసి రాజగోపాల్ రెడ్డికి ఏడుపొచ్చేసందట.. బాత్ రూమ్ కి వెళ్లి ఏడ్చి బయటకు వచ్చారట. ఈ విషయాన్ని రాజగోపాల్ రెడ్డే చెప్పుకున్నారు.
అంతటితో వదిలి పెట్టలేదు. అసలు తెలంగాణలో బీజేపీ బలపడిందంటే దానికి కారణం బండి సంజయ్ అని సర్టిఫికెట్ ఇచ్చారు. పనిలో పనిగా తాను పార్టీ మారే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అదే సమయంలో కవితను అరెస్ట్ చేయకపోవంలో బీజేపీ తప్పేమీ లేదని చెప్పడానికి ఈడీపై ఆరోపణలు చేశారు. ఈడీనికేసీఆర్ మేనేజ్ చేశారని..ఈడీ అధికారులు అమ్ముడుపోయారన్నట్లుగా మాట్లాడారు. ఈ మాటలతో బీజేపీలో కలకలం రేపింది. కోమటిరెడ్డి మరీ అతి చేస్తున్నారన్న అభిప్రాయానికి నేతలు వస్తున్న సమయంలో ఆయనే స్పీచ్ ముగించారు.
ఆ తర్వాత బండి సంజయ్ ఇలాంటివి తాను చాలా చూశానన్నట్లుగా మాట్లాడారు. తాను అధ్యక్షుడిగా ఉన్నంత కాలం.. ఢిల్లీకి పోయి లేని పోని ఫిర్యాదులు చేసేవారని మండిపడ్డారు. కనీసం కిషన్ రెడ్డిని అయినా ప్రశాంతంగా పని చేసుకోనివ్వాలని సూచించారు. బండి సంజయ్ వ్యాఖ్యలు రాజగోపాల్ రెడ్డితో పాటు ఈటల, రఘునందన్ రావులు గురించేనని చెబుతున్నారు. ల మీడియాలో కనిపిస్తూండటం కాదని ప్రజల్లో పని చేయాలన్నారు. మీడియాపై ఫోకస్ పెడితే ప్రజల్లో ఉండలేరన్నారు. మొత్తంగా రాజగోపాల్ రెడ్డి హడావుడి బీజేపీ నేతల్ని అసౌకర్యానికి గురి చేసింది.