తాడేపల్లి నుంచి గుంటూరుకు హెలికాఫ్టర్ లో వెళ్తేనే వింతగా చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు రాజన్న బిడ్డ.. తన ఇంటి పక్క ఊరుకు హెలికాఫ్టర్ లో వెళ్తున్నారు. ఆ పక్క ఊరుకు అంటే.. రెండు కిలోమీటర్లు కూడా ఉండదని ఊరుకు హెలికాఫ్టర్ లో వెళ్లబోతున్నారు. ఈ వైభోగం చూసి అప్పుల ఊబిలో చిక్కుకున్న ఆంధ్రా జనం ఆహా ఓహో అనుకుంటూ ఉంటారు. పైన ఉన్న రాజన్న.. మా బిడ్డ కింగ్ అని.. సంతృప్తిగా ఆత్మకు శాంతి కలుగ చేసుకుంటారు.
చట్ట విరుద్ధమైన పనులు చేయడాన్ని ప్రివిలేజ్ గా భావించే ప్రభుత్వం తమవి కాని ఆర్ 5 జోన్‌లో ఇళ్ల స్థలాల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తోంది. కేసు కోర్టులో ఉన్నప్పటికీ ఇరవై నాలుగో తేదన శంకుస్థాపనకు ఏర్పాట్లు చేశారు. ఇందు కోసం తాడేపల్లి నుంచి బయలుదేరి వెంకటాయపాలెం, కృష్ణాయపాలెం అనే రెండు గ్రామాల్లో పర్యటిస్తారు. తాడేపల్లి వెంకటాయపాలెనికి ఆరు కిలోమీటర్లు, వెంకటాయపాలెం – కృష్ణాయపాలెం మధ్య దూరం రెండు కిలోమీటర్లు ఉంటుంది. ఈ మొత్తం ప్రయాణం పూర్తిగా హెలికాఫ్టర్ ద్వారా సాగుతుంది. ఇందు కోసం రెండు గ్రామాల్లో రెండు హెలిప్యాడ్లు రెడీ చేశారు. అసలు జనం కన్నాపోలీసుల్నే ఎక్కువగా మోహరిస్తున్నారు.
రాజధాని గ్రామాల్లో జగన్ పర్యటన ఏర్పాట్లు చూస్తున్న ప్రజలు, అధికారులు ఇంత భయం ఉంటే కార్యక్రమం అవసరమా అనుకుంటున్నారు. అసలు ఇళ్ల పట్టాల పంపిణీకి అదీ కూడా.. కోర్టు తీర్పునకు లోబడి ఉండేలా.. సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది.ఇళ్లు కట్టుకోవడానికి కాదు. కేంద్రం నిధులు ఇచ్చేందుకు కూడా సిద్ధంగా లేదు. అయినా లబ్దిదారుల్ని భయపెట్టి ఇళ్లు నిర్మించేందుకు సిద్ధమవుతున్నారు.