సీఎం జగన్ రెడ్డి తనకు 151 సీట్లు వచ్చాయని.. తాను ఏం చేయడానికైనా సరే పర్మిషన్ వచ్చేసిందంని అనుకుంటూ ఉంటారు. తాను చేసిందే చట్టం.. అమలు చేసిందే శాసనం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. రాజ్యాంగాన్ని.. చట్టాలను ఎప్పుడూ పట్టించుకోలేదు.కానీ ప్రతీ నిర్ణయం అభాసుపాలైంది. ఇప్పుడు మరోసారి అలాంటి అభాసును జగన్ రెడ్డి సర్కార్ ఎదుర్కోవాల్సి వచ్చింది.
గ్రామ, వార్డు సచివాలయాల్లో మహిళా పోలీసుల పేరుతో ఒక్కొక్కరిని పదిహేను వేల మందిని నియమించారు. తర్వాత వారిని హోంశాఖలో విలీనం చేసి మహిళా పోలీసులు అని పిలవడం ప్రారంభించారు. పోలీస్ స్టేషన్ లోనే రిపోర్టు చేయాలన్నట్లుగా ఆదేశాలు ఇచ్చారు. తరచూ స్టేషన్లకు పిలిపించడం వంటి పనులు చేస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారులు కూడా పదిహేను వేల మంది పోలీసుల్ని రిక్రూట్ చేసుకున్నామని కబుర్లు చెప్పడం ప్రారంభించారు. అయితే ఈ అంశంపై కోర్టులో కేసులు దాఖలయ్యాయి.
వాళ్ల నియామకం కరెక్ట్ గా జరిగిందని… వాళ్లని పోలీసు శాఖలోకి తీసుకోవచ్చని ప్రభుత్వం కోర్టు ముందు చెప్పలేకపోయింది. ఎందుకంటే వారు చేసింది చట్ట విరుద్ధమైన పని. దీంతో.. చివరికి వారి పేరును మహిళా సంరక్షణ కార్యదర్శులు అని మార్చారు.. అసలు పోలీసులకు సంబంధం లేదని.. ఉత్తర్వులిచ్చారు. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ప్రత్యేకంగా ఉత్తర్వులు ఇచ్చారు. వారు అసలు మహిళా పోలీసులు కాదని మహిళా సంరక్షణ కార్యదర్శులని.. పోలీసు శాఖతో సంబంధం లేదని.. వారితో ఎలాంటి పనులు చేయించుకోవద్దని ఆదేశాలిచ్చారు. మరి వారేం చేస్తారు అంటే.తమ గ్రామ, వార్డు సచివాలయం పరిధిలో పిల్లలు, మహిళపై ఏమైనా ఘోరాలు జరిగితే సమాచారం ఇస్తారు.
ఇతర విషయాల గురించి పక్కన పెడితే ప్రభుత్వం రాజ్యాంగాన్ని, చట్టాలను పూర్తి స్థాయిలో ఉల్లంఘించేందుకు చివరి వరకూ ప్రయత్నాలు చేసి.కుదరకపోతే.. అప్పుడు వెనక్కు తగ్గుతోంది. కానీ ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘనలకు అయితే పాల్పడుతోంది.