ప్రాజెక్ట్ కె ఫస్ట్ గ్లింప్స్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. ఆ టింజ్, కలర్, ఆ సెటప్ అంతా హాలీవుడ్ స్థాయిలో కనిపిస్తున్నాయి.నాగ్ అశ్విన్ బ్రహ్మాండం బద్దలు కొట్టే సబ్జెక్ట్ ఏదో తయారు చేస్తున్నాడని ముందు నుంచీ అందరి నమ్మకం. దాన్ని పదింతలు పెంచేలా గ్లింప్స్ కట్ చేశారు. అయితే ఈ సినిమాపై కొన్ని సందేహాలకు సమాధానాలు ఇంకా దొరకలేదు.
ఈ సినిమాని రెండు భాగాలుగా విడుదల చేస్తారని ప్రచారం జరుగుతోంది. నిర్మాత అశ్వనీదత్ ప్లాన్ కూడా అదే. ఇది భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సినిమా. రెండు భాగాలైతే, బడ్జెట్ పరంగా వెసులుబాటు దొరుకుతుంది. అయితే ఈ నిర్ణయం తీసుకోవాల్సింది నాగ అశ్వినే. ఈ కథని ప్రారంభిస్తున్నప్పుడు రెండు భాగాల ఆలోచన లేదు. ఇప్పుడు మాత్రం ఆ దిశగా తర్జన భర్జనలు జరుగుతున్నాయి. గ్లింప్స్‌లో దీనిపై క్లారిటీ లేదు. ఒకవేళ రెండు భాగాలైతే.. దానికి సంబంధించిన హింట్ ఇచ్చేవారు.
2024 సంక్రాంతికి ఈ సినిమాని విడుదల చేస్తారని చెప్పుకొన్నారు. అయితే… ఈ సినిమా ఆలస్యం అవ్వొచ్చని, 2024 వేసవికి షిఫ్ట్ అవుతుందని ప్రచారం జరుగుతోంది. 2024 లో విడుదల అని గ్లింప్స్‌లో చెప్పారు కానీ, డేట్ పై క్లారిటీ ఇవ్వలేదు. అది సంక్రాంతి కావొచ్చు. వేసవి కావొచ్చు. ఈ సినిమాని రెండు భాగాలుగా తీస్తే.. తొలి భాగం సంక్రాంతికి వచ్చేస్తుంది. ఒకే సినిమాగా చూపించాలనుకొంటే మాత్రం… వేసవికే విడుదల. దీనిపై ఓ క్లారిటీ రావాల్సివుంది.