వివేకా హత్య కేసులో వైఎస్ సునీత ఇచ్చిన వాంగ్మూలం వెలుగులోకి వచ్చింది. ఇందులో చాలా విషయాలు ముందే తెలిసినప్పటికి బయటకు తెలియని విషయాలు కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఇష్యూలో సజ్జల రామకృష్ణారెడ్డి మొత్తం డైవర్షన్ గ్యాంగ్ లీడర్ గా వ్యవహరించారని సునీత ఇచ్చిన వాంగ్మూలాన్ని అర్థం చేసుకోవచ్చని న్యాయనిపుణులు చెబుతున్నారు. ఓ సారి తన ఇంటికి వస్తానని భారతి ఫోన్ చేశారని.. పని మీద వెళ్తున్నానని చెప్పిన సజ్జలతో పాటు అనిల్ రెడ్డి, విజయలక్ష్మిలతో సహా వచ్చేశారని తెలిపింది. ఇక నుంచి ఏం చేసినా సజ్జలకు చెప్పాలని భారతి చెప్పి వెళ్లారని సునీత వాంగ్మూలం ఇచ్చారు.
అసలు ఈ మొత్తం వ్యవహారంలో సజ్జల పాత్రపై అనుమానాలు వచ్చేలా ఆమె చాలా విషయాలు చెప్పారు. హత్య ఘటన తర్వాత మీడియాతో మాట్లాడాలని తనకు సజ్జల రామకృష్ణారెడ్డి సునీతకు సూచించారు. కానీ సజ్జల ఆలోచన ఇబ్బందిగా అనిపించి వీడియో చేసి పంపించానని ..గది శుభ్రం చేసేటప్పుడు ఉన్న సీఐ శంకరయ్యపై ఫిర్యాదుతో ఆ విడియో పంపించానన్నారు. అయితే వీడియో కాదు అంశానికి ముగింపు పలికేలా ప్రెస్ మీట్ పెట్టాలని సజ్జల చెప్పారట. జగన్ తో పాటు అవినాశ్ పేరు కూడా ప్రస్తావించాలని సజ్జల అన్నారని సునీత స్పష్టం చేశారు. సునీత సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపారు. సజ్జల సలహా మేరకే హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టానని చెప్పిన సునీత.. అసలు అవినాష్ పై అనుమానం లేదని ప్రత్యేకంగా చెప్పాలని అడగడంతోనే .. అనుమానం వచ్చిందని సీబీఐకి వాంగ్మూలం ఇచ్చారు.
అలాగే వివేకా మృతదేహం మార్చురీలో ఉన్పన్పుడు మార్చురీ బయట ఉంటే ఫిర్యాదు రాసుకొచ్చి సంతకం చేయమన్నారని.. ఆ ఫిర్యాదులో బీటెక్ రవి, టీడీపీ నేతలపై ఆరోపణలున్నాయన్నారు. వివేకా ప్రచారానికి టీడీపీ నేతలు భయపడ్డారని అవినాష్ నాకు చెప్పారని సునీత తెలిపారు. టీడీపీ నేతలు మనసులో పెట్టుకొని ఈ నేరానికి పాల్పడ్డారని అవినాష్ అన్నాడని సునీత వాంగ్మూలం ఇచ్చారు. అయితే ఆ ఫిర్యాదుపై నేను సంతకం చేయలేదన్నారు. మొత్తంగా .. కేసును డైవర్ట్ చేయడానికి టీడీపీ నేతల మీద నెట్టేయడానికి చాలా ఎక్కువగా ప్రయత్నించింది సజ్జల రామకృష్ణారెడ్డే అని సునీత సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో స్పష్టంగా చెప్పింది. మరి సీబీఐ ఎందుకు ఆయనను ప్రశ్నించలేదన్నది కీలకంగా మారింది.