మేఘా ఇంజినీరింగ్ కంపెనీ గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలుసు. ప్రభుత్వాల బడ్జెట్లో ఇరవై, ముప్ఫై శాతం వరకూ ఈ సంస్థకు బిల్లుల చెల్లింపు రూపంలో పోతూంటాయి. అసలు పనులేమీ చేయకుండానే బిల్లులు చెల్లించేశారని ఏపీలో జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. ఈ సంస్త.. చైనా నుంచి తెద్దామనుకున్న ఓ అనుమానాస్పద పెట్టుబడిని..త కేంద్రం నిలిపివేసింది. ఇప్పుడీ అంశం రాజకీయ పారిశ్రామిక వర్గాల్లో హాట్ టాపిక్ గామారింది.
మేఘా సంస్థ.. ఎలక్ట్రిక్ కార్లను ఉత్పత్తి చేస్తామని ముందుకు వచ్చింది. చైనా కంపెనీ బివైడి మోటార్స్‌తో కలిసి ఏర్పాటు చేస్తామని.. రూ.8వేల కోట్ల పైనా పెట్టుబడులు పెడతామని కేంద్రానికి దరఖాస్తు చేసుకుంది. హైదరాబాద్‌లో విద్యుత్ కార్లు, బ్యాటరీల తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని అనుకుంది. అయితే దీని అనుమతులకు కేంద్రం నిరాకరించింది. భద్రతా పరమైన ఆందోళన కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఇప్పటికే బీవైడీ భారత్ లో వాహనాలను విక్రయిస్తోంది.
భారత్‌తో సరిహద్దు పంచుకుంటున్న దేశాల నుంచి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ప్రభుత్వ ముందస్తు అనుమతి తప్పనిసరి చేస్తూ 2020లో కేంద్ర ప్రభుత్వం నిబంధనలు తీసుకొచ్చింది. అన్ని అంశాలు పరిశీలించిన తర్వాతనే నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించింది. అనుకున్నట్లుగానే అన్ని అంశాలు పరిశీలించడంతో ఇది అనుమానాస్పద పెట్టుబడిగా భావించి అనుమతి నిరాకరించినట్లుగా తెలుస్తోంది.