వాలంటీర్లపై వ్యాఖ్యలు చేశారని ప్రభుత్వం అధికారికంగా పవన్ కల్యాణ్‌పై పరువు నష్టం పిటిషన్ వేయాలనుకుంటోంది. ఇందు కోసం సంబంధిత శాఖకు అనుమతి ఇచ్చింది. కానీ ప్రభుత్వం వెళ్లక ముందే తాము కోర్టుకెళ్లాలని జనసైనికులు నిర్ణయించుకున్నారు. పవన్ కల్యాణ్ ప్రత్యేక శ్రద్ద తీసుకుని న్యాయనిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు కాని వ్యక్తుల ద్వారా ప్రజల వ్యక్తిగత డేటాను సేకరిస్తున్నదనేది జనసేన ప్రధాన అభ్యంతరం..
0అలాగే చాలా ప్రాంతాలలో వాలంటీర్లు తమ హోదాను దుర్వనియోగం చేస్తున్నారంటూ పవన్ పదే పదే చెబుతున్నారు.. ‘‘వ్యక్తిగత సమాచారం ఎవరైనా ప్రైవేటు వ్యక్తి దగ్గర ఉంటే అది క్రైమ్’’ అంటూ గతంలో జగన్ చేసిన వ్యాఖ్యల తాలూకు వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. మరో వైపు ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లే అంశంపై .. న్యాయ నిపుణులు కూడా ఎలా సాధ్యం అని చర్చించుకుంటున్నారు. ఎందుకంటే కోర్టుకు వెళ్తే.. వాలంటీర్లతో ప్రభుత్వం ఏం చేయించుకుంటుందో చెప్పాలి. డేటా సేకరణ చేయించుకుంటున్నారని చెబితే మొదటికే మోసం వస్తుంది.
అసలు వాలంటీర్ల వ్యవస్థ కు చట్టబద్ధత లేదు. ప్రజాధనం జీతంగా ఇస్తున్నారు. ఇప్పుడు దానికి హైకోర్టు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. వారి తరపున కోర్టుకు ఎందుకు వచ్చారో కూడా చెప్పాల్సి ఉంటుంది. మరో వైపు కోర్టుకు జనసేననే ముందు వెళ్లబోతోంది. వాలంటీర్లపై వైసీపీ, జనసేన న్యాయపోరాటం ఎటు దారి తీస్తుందోనన్న ఉత్కంఠ ఏర్పడుతోంది.