వైసీపీలో నియోజకవర్గ వంచాయతీలు పెరిగిపోతున్నాయి. టిక్కెట్ ఇస్తావా.. పొమ్మంటావా అని బెదరించే వారి సంఖ్య పెరిగిపోయింది. ఇప్పటికే అనేక నియోజకవర్గాల్లో పరిస్థితి తేడాగా ఉంటే.. ఇప్పుడు వల్లభనేని వంశీ ప్రత్యర్థులూ బలం తెచ్చుకుని రేసులోకి వచ్చారు. గతంలోనే జగన్ రెడ్డి ఈ నియోజకవర్గ నేతంలదర్నీ పిలిచి.. ఫిరాయించి వచ్చినందున వంశీకే టిక్కెట్ ఖరారు చేస్తున్నామని మిగతా వారందరూ పార్టీకి చేయాలని దిశానిర్దేశం చేశారు. గత ఎన్నికల్లో వంశీపై పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావుకు ఓ పదవి ఇచ్చారు.
కొన్నాళ్లు సైలెంట్ గా ఉన్న వెంకట్రావు ఇప్పుడు తెరపైకి వచ్చారు. గన్నవరం నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు. ఆయనకు దుట్టా రామచంద్రరావు మద్దతు ఎలాగూ ఉంటుంది. కొన్నాళ్లుగా ఆయన టీడీపీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. వంశీపై తానే గన్నవరం నుంచి పోటీ చేస్తానని చెబుతున్నారు కానీ ఏ పార్టీ అన్నది చెప్పడం లేదు. అందుకే.. వైసీపీలోనూ టెన్షన్ ప్రారంభమయింది.
గన్నవరం నియోజకవర్గం సీటు తనదేనని శాసన సభ్యుడు వల్లభనేని వంశీ చెబుతున్నారు. గతంలో ముఖ్యమంత్రి జగన్ తనకు స్వయంగా హామీ ఇచ్చారని చెబుతున్నారు. అయితే స్దానిక నాయకత్వం పార్టీ కి వ్యతిరేకంగా కార్యకలాపాలను నిర్వహించటం సమంజసం కాదని వంశీ గతంలో బహిరంగంగా వ్యాఖ్యానించారు. అయితే తెలుగు దేశం పార్టి టిక్కెట్ పై గెలిచిన వంశీ, ఎన్నికల తరువాత పార్టీ మారడంతో.. వైసీపీలో చిచ్చు ప్రారంభమయింది.