చిత్తూరు .. ఆ చుట్టుపక్కల ఏ ఎన్నిక జరిగినా పెద్ద ఎత్తున టూరిస్టు బస్సుల్లో ఓటర్లు వస్తారు. ఓ పోలింగ్ బూతుల్లో ఇతర రాష్ట్రాల వారు వేల మంది వచ్చి ఓట్లేస్తూ ఉంటారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈ విషయాలు హైలెట్ అవుతూనే ఉంటాయి. చివరికి పట్టభద్రుల ఎన్నికలోనూ అదే జరిగింది. టూరిస్ట్ ఓటర్లు అంతా మంత్రి పెద్దిరెడ్డికి చెందిన బ్యాచ్ అని మరోసారి నిరూపితమయింది. రాష్ట్రంలో అసలు డోర్ నెంబర్లే లేని ఇళ్లల్లో నివసిస్తున్న ఓట్ల సంఖ్య అత్యదికంగా పుంగనూరునే ఉంది. మొత్తం రెండులక్షలమంది ఓటర్లలో ఏకంంగా 32వేల మంది పుంగనూరు లో డోర్ నెంబర్ లు లేకుండా ఉన్నారట.
గ్రామ పంచాయతీల్లోనూ డోర్ నెంబర్లు ఉంటాయి. ఇలా డోర్ నెంబర్లు లేని ఓట్లలో అత్యధికం దొంగ ఓట్లు ఉంటాయి. పెద్ది రెడ్డి వరుసగా గెలవడానికి ఈ దొంగ ఓట్లే కారణమన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఇలా వేల సంఖ్యలో ఉన్న డోర్ నెంబర్ లేని ఓట్లు వెరీఫికేషన్ లో వెలుగు చూస్తున్నాయి. ఒకే డోర్ నెంబర్ పై వందల ఓట్లు ఉండటం వంటివి కూడా వెలుగులోకి వస్తున్నాయి. అసలు ఓటర్ జాబితా ఎలా మానిపులేషన్ జరిగిందో విచారణ చేయాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. ఈసీ ఎలా స్పందిస్తుందో తెలియదు కానీ ఓటర్ల జాబితా అక్రమాలన్నింటినీ టీడీపీ బయటపెడుతోంది.
వైసీపీ నేతలు రివర్స్ లో వేల కొద్ది దొంగ ఓట్లు కుప్పంలో ఉన్నాయని.. ఆరోపణలు చేస్తున్నారు. తమ దొంగతనం బయటపడినప్పుడు ఎదుటి వారిని దొంగే దొంగ అని అరవడం వైసీపీ స్ట్రాటజీల్లో ఒకటి. టీడీపీ కి ఓట్లు వేసే వారిని దొంగ ఓటర్లని.. వారి ఓటు హక్కు తీసేయాలన్నట్లుగా వైసీపీ తీరు ఉంది. మొత్తంగా … ఆధార్ సీడింగ్ చేసిన తర్వాత కూడా ఓటర్ల జాబితాలో పక్కాగా రూపొందించలేకపోతే… ఎన్నికలు నిర్వహించడంలో ఈసీ విఫలమైనట్లే. అంటే… ప్రజాస్వమ్య వ్యవస్థ కుప్పకూలినట్లే.