పవన్ కల్యాణ్ మానసిక క్షోభకు గురి చేశారంటూ ఓ విజయవాడ వాలంటీర్ దాఖలు చేసిన పిటిషన్ ను విజయవాడ కోర్టు తీసుకోలేదు. అసలు వాలంటీర్ నియామక పత్రం ఏదని కోర్టు ప్రశ్నించింది. దీంతో పిటిషన్ వెనక్కి పోయింది. వైసీపీ పరువు పోయినట్లయింది. ఆ వాలంటీర్ వెనుక ఉన్నది వైసీపీనేనని అందరికీ తెలుసు. ప్రభుత్వం కోర్టుకు వెళ్లడానికి జీవో ఇచ్చింది.కానీ ఇప్పటికీ వెళ్లలేకపోతోంది. ఎందుకంటే.. కోర్టుకెళ్తే వాలంటీర్ వ్యవస్థలోని బొక్కలన్నీ బయటకు వస్తాయి.
అందుకే కింది కోర్టులో పిటిషన్ వేసి.. ఏదో చేయాలనుకుంది. అందుకు ఓ వాలంటీర్ ను పావుగా వాడుకున్నారు. మరి తాను వాలంటీర్ అని చెప్పడానికి ప్రభుత్వం జారీ చేసిన నియామకపత్రం చూపించాలిగా.. అది మత్రం ఇవ్వడం లేదు. అది ఇస్తే ఏ చట్టం కంద వాలంటీర్లను నియమించారన్నది స్పష్టత ఇవ్వాలి. స్వచ్చంద సేవకులకు డబ్బులు.. అదీ కూడా ప్రజాధనం ఇవ్వడాన్ని సమర్థించుకోవాలి. దీనికి ఏ చట్టమూ లేదు.
అందుకే పవన్ కల్యాణ్ పై పిటిషన్ కోర్టు తిరస్కరించినా కుక్కిన పేనులా సైలెంట్ గా బయటకు వచ్చారు. పవన్ కోర్టుకు రావాల్సి ఉంటుందని అదనీ..ఇదనీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన వైసీపీ లాయర్లు..పిటిషన్ వెనక్కి వచ్చిందని .. వస్తుందని తెలిసి కూడా.. ఓవరాక్షన్ చేశారు. ప్రభుత్వం బెదిరించడానికి బ్లాక్ మెయిల్ చేయాడనికి ఇలా వ్యవస్థల్ని వాడుకుంటుందన్న విమర్శలు ఈ కారణంగానే వస్తున్నాయి.