ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన పురందేశ్వరి విస్తృతంగా పర్యటిస్తన్నారు. జోనల్ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. రాయలసీమ, కోస్తాల్లో పూర్తి చేశారు. గతంలో ఏ నేత అధ్యక్ష పదవి చేపట్టినా కనిపించనంత ఉత్సాహం ఉప్పుడు బీజేపీలో కనిపిస్తోంది. ఏ సమావేశం పెట్టినా.. ప్రతినిధులు దండిగానే హాజరవుతున్నారు. ఇది బీజేప వర్గాలను కూడా ఉత్సాహ పరుస్తోంది.
వైసీపీ ప్రభుత్వపై విరుచుకుపడే విషయంలో పురందేశ్వరి మాటల్లో నిజాయితీ కనిపిస్తోందన్నది ఎక్కువ మంది అభిప్రాయం. గతంలో సోమ వీర్రాజు ఏదైనా జగన్ రెడ్డిని విమర్శించాలంటే ముందుగా చంద్రబాబును, టీడీపీని విమర్శించేవారు. ఆ తర్వాత జగన్ రెడ్డి వద్దకు వచ్చేవారు. పైగా వారి విమర్శల్లో అంత పదును కూడా కనిపించేది కాదు. ఏదో పైపైన కావాలని విమర్శలు చేస్తున్నట్లుగా ఉండేది. కానీ పురందేశ్వరి అలా కాదు. నేరుగానే లెక్కలతో సహా విమర్శిస్తున్నారు.
అయితే బీజేపీపై ఎవరికీ నమ్మకం కలగడంలేదు. దీనికి కారణం మాటలు కాదు.. చేతలు కూడా ఉండాలన్న అబిప్రాయం ప్రజల్లో ఉండటమే. బీజేపీ ప్రత్యేకంగా ఏమీ చేయాల్సిన పని లేదని.. నిబంధనలు పాటిస్తే చాలని.. ఏపీ సర్కార్ గుట్టు మొత్తం బయటపడుతుందన్న అంచనాలు ఉన్నాయి. ఇప్పటికీ అనేక విషయాల్లో అడ్డగోలుగా కేంద్రం సహకరిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకే..బీజేప విషయంలో పురందేశ్వరి మార్పు చేయించాలన్న కేంద్రం సహకారం ఉండాలంటున్నారు.
తమిళనాడులో అన్నామలైకు ఇస్తున్న సహకారంలో పది శాతం ఇచ్చినా.. ఏపీలో పురందేశ్వరి డిఫరెన్స్ చూపిస్తారని అంటున్నారు . కానీ అలాంటి ఆలోచన బీజేపీకి ఉందా అన్నదే డౌట్.