ఎన్నికలకు ముందు జగన్ రెడ్డి – బీజేపీ బంధంపై ఓ స్పష్టమైన అభిప్రాయం ప్రజలకు ఏర్పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. జగన్ ప్రభుత్వం అప్పులు లేకపోతే రోజు గడిచే పరిస్థితి లేదు. ప్రతీ వారం ఆర్బీఐ వేలంలో వేల కోట్ల అప్పులు చేస్తున్నారు. అదనంగా ఇతర మార్గాల్లో కార్పొరేషన్ల ద్వారా రుణాలు తెస్తున్నారు. అన్నీ కలిపి .. ఇచ్చిన అనుమతులు దాటిపోయాయి. ఇప్పుడు అదనంగా అప్పులు పొందకపోతే వచ్చే మూడు, నాలుగు నెలలు తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని జగన్ రెడ్డిసర్కార్ ఎదుర్కొంటుంది.
రూ. 12 వేల కోట్ల రాజ్యాంగ విరుద్ధ అప్పులకు జగన్ రెడ్డి సర్కార్ రెడీ !
అందుకే మరోసారి మందుబాబుల్ని తాకట్టుపెట్టేందుకు సిద్ధమయింంది. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా అక్రమ పద్దతిలో అప్పులు తెచ్చేందుకు కొత్త ప్రయత్నాలు చేస్తోంది. దాదాపుగా రూ. 12వేల కోట్లకు ప్రయత్నాలు చేస్తోంది. కొత్త కన్సల్టెన్సీని నియమించుకుంది.ఇలా అప్పులు చేయడం రాజ్యాంగ విరుద్ధమని ఇప్పటికే కేంద్రం కూడా చెప్పింది. ఇప్పుడు బీజేపీ ఆ అప్పులకు సహకరిస్తే… తీసుకొచ్చుకుంటారు.. లేకపోతే మాత్రం ప్రభుత్వం చిక్కుల్లో పడుతోంది. జగన్ రెడ్డి సర్కార్ ను తమిళనాడుసర్కార్ రలా వెంటాడాల్సిన అవసరం లేదని.. కేవలం నిబంధనలు పాటించేలా చేస్తే చాలని.. ఇరువురి మధ్య ఏ బంధం లేదని ప్రజలు అనుకుంటారు. కానీ రాష్ట్రాన్ని దివాలా తీయించేందుకు సహకరిస్తే మాత్రం.. బీజేపీని ఇక ఎవరూ నమ్మరు.
అప్పులకు కేంద్రం సహకరిస్తే జనసేనను మోసం చేసినట్లే !
వచ్చిన ఆదాయంలో నలభై శాతం వడ్డీలకే కట్టాల్సి వస్తోంది. అందుకే అప్పులు తెచ్చి వడ్డీలు కడుతున్నారు. ఆ అప్పులే రాకపోతే వడ్డీలుకూడా కట్టడం కష్టమవతుుంది. ఇక జీతాల సంగతి చెప్పాల్సిన పని లేదు. నిజానికి ఇలాంటి పరిస్థితి గత రెండు, మూడేళ్లుగా ఉంది. కానీ కేంద్రం ఎప్పటికప్పుడు… జగన్ రెడ్డికి సహకరిస్తూనే ఉంది. అడ్డగోలు అప్పులు తెచ్చుకోవడానికి.. అదనపు సాయం చేయడానికి ఏ మాత్రం సంకోచించడం లేదు. కానీ ఇప్పుడు ఎన్నికల సమయం. పొత్తుల రాజకీయాలు ఊపందుకున్న సమయం. జగన్ రెడ్డికి సహకరిస్తే ఏపీలో బీజేపీ మిత్రపక్షం జనసేనను మోసం చేసినట్లే అవుతుంది.
సహకరించకపోతే జగన్ డబ్బుల డ్రామాలన్నీ బట్టబయలు – ప్రజల తిరుగుబాటే !
ఒక వేళ బీజేపీ తన స్టాండ్ ను మార్చేసుకుంటే.. . జగన్ రెడ్డికి సహకరించకపోతే.. ప్రజల నుంచి తిరుగుబాటు మొదలవుతుంది. ఇంత కాలం పథకాలు ఇస్తున్నారు కదా. . ఏం చేసుకుంటే మనకేంటి అనే భావనలో లబ్దిదారులు ఉన్నారు.ఇప్పుడు ఆ పథకాలూ రాకపోవడం.. రాష్ట్రం నాశనం చేయడాన్ని ప్రజలు అసలు జీర్ణించుకోలేరు. అందుకే వారి నుంచి తిరుగుబాటు వస్తుంది. అదే జరిగితే .. ఎన్నికలకు ముందు జగన్ రెడ్డి గడ్డు పరిస్థితిని ఎదుర్కొనే అవకాశం ఉంది.