మహిళల మిస్సింగ్‌పై వ్యాఖ్యలు చేసిన పవన్ కల్యాణ్‌కు పది రోజుల్లో సమాధానం చెప్పాలని నోటీసులు ఇచ్చి రెండు వారాలు దాటిపోయింది. కానీ మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ మాత్రం మళ్లీ హడావుడి ప్రారంభించలేదు. లేకపోతే.. పవన్ కు సమన్లు జారీ చేసి .. మహిళా కమిషన్ కార్యాలయంలో పీఠమేసుకుని కూర్చుని… పవన్ రావాలి..లేకపోతే అరెస్ట్ ఖాయం అని సాక్షి తో పాటు కూలీ మీడియాలో గంభీరమైన ప్రకటనలు చేస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు ఆమె కనిపించడం లేదు.
జగన్ రెడ్డి మహిళా కమిషన్ పదవి కాలాన్ని తగ్గించేశారు. అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆమోదించారు. విషయం బయటపడే సరికి… అది తర్వాత నియామకాలకు అని చెబుతున్నారు. కానీ ఆమె పదవి కాలం పూర్తయిందని ఆఫీసు ఖాళీ చేయాలన్న ఉత్తర్వులు కూడా ఇచ్చారు. ఈ గంందరగోళం ఇలా సాగుతుందనే.. ఆమె బయటకు రావడం లేదని తెలుస్తోంది. ఆమె పదవి కాలం ఉందో లేదో ఎవరికీ తెలియదు. కానీ చేసిన హడావుడి మాత్రం చాలా ఉంది.
మహిళా కమిషన్ ను రాజకీయంగా వాడుకుని.. మహిళలకు ఘోరమైన అన్యాయన్ని చేసిన విషయం మాత్రం బహిర్గతమయింది. ముఫ్పై వేల మంది మహిళలు మిస్సయ్యారనే సమాచారం ఎక్కడితో చెప్పాలని ఆధారాలు ఇవ్వాలని వాసిరెడ్డి పద్మ నోటీసులిచ్చారు. ఇప్పుడు కేంద్రమే సమాధానమిచ్చింది. పవన్ పై కాకపోయినా… మహిళల మిస్సింగ్‌లపై పట్టని… ప్రభుత్వాన్ని.. డీజీపీని అయినా మహిళా కమిషన్ ప్రశ్నిస్తుందా అన్నది కీలకం. ప్రజారాజ్యం నుంచి రాజకీయాల్లోకి వచ్చి… ఆ పార్టీ పతనానికి ఇతర పార్టీలతో కుట్రలు చేశారని ఆరోపణలు ఉన్న వాసిరెడ్డి పద్మ.. ఇప్పుడు కూడా అదే రాజకీయం చేస్తున్నారన్న ఆరోపణలు అందుకే వస్తున్నాయి.