సీఎం జగన్ – భారతిల సమీప బంధువు ఈసీ సురేంద్రనాథ్ రెడ్డికి అక్రమంగా ప్రొఫెసర్ పోస్టు ఇచ్చారని … ఆ నియామకాలు చెల్లవని హైకోర్టు ఇటీవల తీర్పు ఇచ్చింది ఆ ప్రకారం ఆయన ఉద్యోగం పీకేయాల్సి ఉంది. కానీ ఈ రోజు పీకేసినట్లుగా ఉత్తర్వులిచ్చారు. కోర్టు తీర్పును అమలుచేశారు. మళ్లీ తర్వాత రోజే అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉద్యోగమిచ్చారు. రేపో మాపో మళ్లీ ఏదో రూల్ కింద ప్రొఫెసర్ ఉత్తర్వులిస్తారు. నిజానికి జగన్ రెడ్డి టైప్ మార్క్ అక్రమాల్లో… తమ వారికి మేలు చేయాలంటే. .. ఒక్కరికే చేయరు. గుంపులో చేసేస్తారు. ఆ గుంపు అంతా బలైపోతారు.. కానీ అసలైన వ్యక్తి పదవి మాత్రం ఉండిపోతుంది. ఇప్పుడు కూడా అంతే. సురేంద్రనాథ్ రెడ్డితో పాటు అక్రమంగా ప్రొఫెసర్ ఉద్యోగాలు పొందిన వారు అంతా ఉద్యోగాలు కోల్పోయారు. కానీ సురేంద్రనాథ్ రెడ్డికి మాత్రం మళ్లీ ఉద్యోగం వచ్చేసింది.
జగన్ సతీమణి వైఎస్ భారతికి ఈసీ సురేంద్రనాథరెడ్డి స్వయాన పెదనాన్న కుమారుడు. పులివెందుల నియోజకవర్గంలోని గొల్లలగూడూరు ఈసీ సురేంద్ర స్వస్థలం. ఈయన తండ్రి పేరు ఈసీ పెద్దగంగిరెడ్డి. భారతి తండ్రి పేరు ఈసీ చిన్నగంగిరెడ్డి. ఈసీ చిన్నగంగిరెడ్డి వైద్యుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మామ. ఈసీ సురేంద్రనాథ్‌రెడ్డి కడపలో యోగివేమన విశ్వవిద్యాలయంలో బయోటెక్నాలజీలో విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగంలో చేరారు. అనంతరం వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కాగానే, సురేంద్రనాథ్‌రెడ్డిని ప్రొఫెసర్‌గా ప్రమోట్ చేస్తూ స్పెషల్ జీవో విడుదల చేశారు. అనంతరం కడపలో ఏర్పాటు చేసిన ఆర్కిటెక్చర్ విశ్వవిద్యాలయానికి డిప్యుటేషన్‌పై రిజిస్ట్రార్‌గా పంపారు. అసలు మొదట ఆయన ఉద్యోగం హాస్టల్ వార్డెన్.
వివేకా హత్య కేసులోనూ సురేంద్రనాథ్ రెడ్డిని సీబీఐ ప్రశ్నించింది.. వివేకా హత్య జరిగిన రోజున అవినాష్ రెడ్డితో పాటే ఉన్నారు. ఆయనతో పాటు వివేకా ఇంటికి వెళ్లారు. ఈ కారణంగానే ఆయనకు పోస్టుల విషయంలో కోర్టు ఉత్తర్వులను సైతం పట్టించుకోకుండా… వెంట వెంటనే వేరే ఉత్తర్వులు ఇచ్చేస్తున్నారని చెబుతున్నారు.