కేసీఆర్ చేసేవి కుటుంబ రాజకీయాలంటూ అందరూ విమర్శలు గుప్పిస్తూ ఉంటారు. అయితే కేసీఆర్ ఇలాంటి వాటిని అసలు పట్టించుకోరు. తన అన్న కుమారుడికి మహారాష్ట బీఆర్ఎస్ ఇంచార్జ్ పదవి ఇచ్చారు. సీఎం కేసీఆర్ అన్న కుమార్తె రమ్యారావు తరచూ బీఆర్ఎస్కు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ మీడియాలో హైలెట్ అవుతూంటారు. ఆమె కేసీఆర్ అన్న కుమార్తె కావడంతోనే అందరూ చర్చించుకుంటారు. ఇప్పుడు ఆ రమ్యారావు సోదరుడు అంటే కేసీఆర్ అన్న కుమారుడికి మహారాష్ట్ర ఇంచార్జ్ పదవి ఇచ్చారు.
కేసీఆర్ అన్న కల్వకుంట్ల రంగారావు కుమారుడు కల్వకుంట్ల వంశీధర్‌రావు ను మహారాష్ట్ర బీఆర్ఎస్ ఇన్చార్జిగా కేసీఆర్ నియమించారు. నిజానికి ఆ కుటుంబంతో కేసీఆర్‌కు పెద్దగా సంబంధాలు లేవు. అందుకే గతంలో ప్రజారాజ్యం పార్టీ ద్వారా వంశీధర్‌రావు 2009లో రాజకీయాల్లోకి వచ్చారు. కానీ కలసి రాకపోవడంతో సైలెంట్ అయ్యారు. ఇటీవల కేసీఆర్‌కు దగ్గరయ్యారని చెబుతున్నారు. దీంతో ఆయనకు మహారాష్ట్ర బీఆర్ఎస్ ఇన్చార్జిగా కేసీఆర్ కీలక బాధ్యతలు అప్పగించారు.
రంగారావు ఫౌండేషన్ పేరిట సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వంశీధర్‌రావు సిద్దిపేట నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం ఇటీవల అంతర్గతంగా జరగుతోంది. కానీ, ఆయన ను మహారాష్ట్ర బీఆర్ఎస్ ఇన్చార్జిగా నియమించారు. కేసీఆర్ మహారాష్ట్రపై ప్రత్యేక దృష్టి పెట్టారు. వరుసగా చేరికలు ఉండేలా చూసుకుంటున్నారు. అక్కడ నుంచి పోటీ చేసే అంశాన్నీ కేసీఆర్ పరిశీలిస్తున్నట్లుగా చెబుతున్నారు.