అజేయకల్లాం సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంతో జగన్ రెడ్డిని నిండా ముంచేశారని ఇక దర్యాప్తు అంటూ ముందుకు సాగితే అది జగన్ దగ్గరకే చేరుతుందని న్యాయనిపుణులు అంచనా వేస్తున్న సమయంలో.. . చివరికి ఆ వాంగ్మూలాన్ని తొలిగిస్తే పోలా అనే ఐడియాకు క్రమినల్ బ్రెయిన్స్ వచ్చేశాయని తాజా పరిణామలు నిరూపిస్తున్నాయి. సీబీఐకి తాను ఇచ్చిన స్టేట్ మెంట్ ను తొలగించాలంటూ ఆయన తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఆయన పిటిషన్లో పేర్కొన్న విషయాలు కూడా విచిత్రంగా ఉన్నాయి. సీబీఐ చార్జిషీట్ లో పేర్కొన్నదేంటి అనే విషయంపై కూడా పూర్తి క్లారిటీ లేదని చెప్పుకొచ్చారు. పత్రికల్లో చూసి తాను ఆ విషయం తెలుసుకున్నానని, అది కూడా పూర్తిగా వక్రీకరించారని దాన్ని తొలగించాలని చెప్పుకొచ్చారు. . ఇతరులను కేసులో ఇరికించే ధోరణితోనే సీబీఐ తన వాంగ్మూలాన్ని తప్పుగా పేర్కొన్నదని ఆయన అంటున్నారు. అందుకే దాన్ని చార్జిషీట్ నుంచి తొలగించాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే అసలు చార్జిషీట్లో ఏముందో తెలియకుండా దాన్ని తొలగించాలని పిటిషన్ వేయడం ఏమిటన్న విస్మయంగా సహజంగానే అందరికీ వస్తుంది.
సీబీఐ అధికారులు నోటి మాటగా వాంగ్మూలాలు రికార్డు చేయరు. ఖచ్చితంగా రికార్డు చేసుకునే ఉంటారు. అయినా అజేయకల్లాం ఎందుకు కంగారు పడుతున్నారో ఆయనకే తెలియాలి. మొత్తం కేసులో అజేయకల్లాం వాంగ్మూలం మలుపు తిప్పినట్లేనని చర్చ జరుగుతూండటమే దీనికి కారణం. ఇటీవల అజేయకల్లాంకు సలహాదారు పదవి కూడా పొడిగించారు