ఆంధ్రజ్యోతి ఆర్కేకు ఎదుటి వారు సందు ఇవ్వాలని.. తానంటే ఒక అది. ఒక ఇది అని చెప్పుకోవడానికి తన కొత్త పలుకును పూర్తి స్థాయిలో వినియోగంచుకుంటారు.గతంలో ప్రభుత్వాలపై తాను చేస్తున్న పోరాటాన్ని మరెవ్వరూ చేయలేరన్నట్లుగా చెప్పుకున్న ఆయనకు ఈ సారి అవకాశం సజ్జల రూపంలో వచ్చింది. ఇటీవల ఓ ప్రెస్ మీట్లో మాట్లాడిన సజ్జల. వివేకా కేసులో సీబీఐ తీరును ప్రశ్నించారు. పనిలో పనిగా .. వైఎస్ సునీతకు సలహాదారుగా ఆంధ్రజ్యోతి ఆర్కే ఉన్నారని ఆరోపించారు. ఇది ఒక్కటి బాగా కనెక్ట్ అయింది ఆర్కేకు. వెంటనే ఈ వారం కొత్త పలుకులో తన ఎలివేషన్లు ఇచ్చేసుకున్నారు.
అసలు వైఎస్ వివేకా హత్య కేసులో బాధితులకు మద్దతుగా ఉంటున్న మీడియా తమ ఒక్కరిదేనని.. చెప్పుకొచ్చారు. వివేకా హత్య కేసులో బాధితులు తన సపోర్ట్ వస్తున్నారని.. తాము మాత్రమే అండగా ఉంటున్నామని చెబుతున్నారు. ఆర్కే నేరుగా చెప్పకపోయినా.. తండ్రి హంతకులకు శిక్ష పడేలా శ్రమిస్తున్న సునీత కు జగన్ రెడ్డి.. ఏపీ ప్రభుత్వం.. కేంద్ర ప్రభుత్వం, సీబీఐ ఇలా ఏ ఒక్కటి నిజాయితీగా న్యాయం చేయాలని ప్రయత్నించడం లేదు. అందరూ … ఏదో ఓ సందర్భంల్లో కుమ్మక్కయి సునీతకు అన్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తాను మాత్రమే ఆమెకు సహకరిస్తూ.. న్యాయం వైపు .. నిస్సహాయురాలైన సునీత వైపు నిలబడ్డానని చెప్పుకున్నారు.
ఇలా చెప్పుకునే క్రమంలో ఆర్కే స్వయం ఎలివేషన్లతో పాటు .. వివేకా హత్య కేసులో చాలా లాజిక్కులను చదివేవాళ్ల మైండ్ లోకి ఎక్కించారు.అవన్నీ కాదనలేని విషయాలే. హత్య కేసు విచారణ విషయంలో ప్రతి ఒక్కరికి వచ్చే సందేహాలకు ఆయన మరింత బలం చేకూర్చారు. అదే సమయంలో తమకు అనుకూలంగా జరిగే విచారణలు, తీర్పులను మాత్రమే స్వాగతించి మిగతా వాటన్నింటిపై చంద్రబాబు ముద్ర వేసే వైసీపీ నేతల తీరును.. జగన్మోహన్ రెడ్డి మన స్థత్వాన్ని కూడా విశ్లేషించారు.
మొత్తంగా ఈ వారం ఆర్టికల్లో తాను ఎలా వివేకా కేసులో సునీతకు అండగా ఉంటున్నానని చెప్పకనే చెప్పుకొచ్చారు. అది మీడియా ద్వారానా.. నిజంగానే సజ్జల చెప్పినట్లుగా సునీతుక సలహాదారుగా అన్నది స్పష్టత రాలేదు. సజ్జల జర్నలిస్టు నుంచి సలహాదారు అయ్యారు కానీ తాను మాత్రం జర్నలిస్టుగానే ఉంటానని.. ఈ క్రమంలో చాలా మందితో మాట్లాడుతూ ఉంటానని చెప్పుకొచ్చారు.