ఏపీలో మంత్రులందరూ నెరిసిన జుట్టుతో కనిపిస్తూంటారు. మంచి బ్లాక్ కలర్ రంగును జుట్టుకు వేసుకుని షోకిల్లా రాయుడిలా ఉండే .. అంబటి రాంబాబు ఇప్పుడు పూర్తిగా ముగ్గుబుట్టను నెత్తి మీద పెట్టుకుని వస్తున్నట్లుగా కనిపిస్తున్నారు. ఆయన ఒక్కరే కాదు.. మంత్రులంతా అంతే.. చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ… బొత్స సత్యనారాయణ సహా అందరూ జుట్టుకు రంగేసుకోవడం లేదు. మొత్తం మంత్రి వర్గంలో ఒక్క సీఎం మాత్రమే నిగనిగలాడుతూ కనిపిస్తూంటారు.
అసలు ఎందుకు కేబినెట్ మంత్రులు హెయిర్ డై వేసుకోకూడదంటే…. దానికి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. మంత్రి అయిన కొత్తలో అంబటి రాంబాబు.. ఇలా … ఖరీదైన సెలూర్లో నేచురల్ కలర్ వేసుకుని వెళ్తే.. .. పిచ్చ క్లాస్ పీకారాని తేలింది. రంగు పోయే వరకూ ఎదురుపడవద్దని హెచ్చరించడమే కాదు.. మరోసారి హెయిర్ డై వేసుకుంటేరావాల్సిన అవసరం లేదని తేల్చేశారు. దీంతో బాస్ రెడ్డికి తన గ్లామర్ ఇష్టం లేదని ఆయనకు అర్థం అయిపోయింది. అప్పట్నుంచి మానేశారు. అక్కడ ఎవరికీ ప్రత్యేకంగా చెప్పారు. ఎవరికో ఒకరికి అనుభవం అయిందంటే… అందరికీ వర్తిస్తుంది. అందుకే మిగిలిన వారు కూడా అర్థం చేసుకోవాలి చేసుకున్నారు.
అయినా తాము జుట్టుకు రంగేసుకుంటే.. బాస్ రెడ్డికి ఎందుకు కోపమో అని.. వారికి అనుమానం ఉంది. అనుమానమా.. కుళ్లా అన్న డౌట్ కూడా ఉంది. నుగ్గుబుట్టల మధ్య తన గ్లామర్ మాత్రమే హైలెట్ అవ్వాలని ఆయన వేసుకున్న ప్లాన్ అన్న సందేహాలు కూడా ఉన్నాయి. కానీ పదవి కోసం మొత్తం త్యాగం చేసేశారు కాబట్టి…. ఏదో ఒకటిలే అని సర్దుకుపోతున్నారు.