ఏపీలో ఓ వ్యక్తి ఓటు వేయడానికి బయలుదేరాడు. దారిలో ఓ వ్యక్తి కలిసి మీకు ఎన్ని అప్పులు ఉన్నాయో.. వ్యాపారాల్లో ఎలాంటి నిబంధనలు ఉల్లంఘిచారో గుర్తు చేస్తాడు… కొంచెంద దూరం పోయిన తర్వాత ఆన్ లైన్ ఫోన్ కాల్ లో పొరపాటున చేసిన సంభాషల వీడియోను ఒకడు చూపిస్తాడు… మరొకడు వచ్చి వివాహేతర బంధాన్నీ గుర్తు చేస్తాడు… ఇంకొకడు వచ్చి నీ బ్యాంక్ అకౌంట్లో ఇంత డబ్బు ఉంది.. ఎలా వచ్చాయో తేలుస్తామని చెబుతాడు…ఇంకా ఇలాంటి ఊహించని వ్యక్తిగత సీక్రెట్లతో ఓటింగ్ కు వెళ్లే వరకూ బెదిరింపులు ఉండవచ్చు. ఇవ్నీ వారికి ఎలా తెలుసు మీరు ఆశ్చర్యపోవద్దు. ఎందుకంటే… ఏపీలో ప్రజలందరి 360 డిగ్రీల ప్రోఫైలింగ్ ప్రభుత్వం చేసేసింది .
360 డిగ్రీల ప్రోఫైలింగ్ అంటే.. అక్రమ సంబంధాలతో సహా మొత్తం ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి నిక్షిప్తం చేయడం. అధికారంలోకి వచ్చినప్పటి నుండి వాలంటీర్లను ప్రయోగించి జగన్ రెడ్డి సర్కార్ చేస్తోంది సమాచార సేకరణే. ఒకటో తేదీన పెన్షన్లు పంచడం మాత్రమే వాలంటీర్లకు ఉన్న విధి.. తర్వాత వారి పని సమాచార సేకరణ చేయడం. ప్రజల గురించి వ్యక్తిగత సమాచారాన్ని ప్రైవేటు సంస్థ అయిన ఎఫ్ఓఏకు చేరవేయడం. వారి పౌరుల డౌటాను 360 డిగ్రీల ప్రోఫైలింగ్ చేస్తారు. చివరికి అది … రాజకీయ అసాంఘిక శక్తులకు.. ఎన్నికల సమయంలో ఆయుధంగా మారనుంది.
గత ఎన్నికల్లో ఏం మ్యాజిక జరిగిందో కానీ.. వచ్చే ఎన్నికల్లో భయం చూపించి బ్లాక్ మెయిల్ చేయించుకుని జనాలతో ఓట్లు వేయించుకోవాలన్న ఓ లక్ష్యాన్ని మాత్రం అధికారం చేపట్టిన నాటి నుండే జగన్ రెడ్డి అమలు చేయడం ప్రారంభించారు. అదే మంచి చేసి… అభివృద్ధి చేసి ఓట్లు వేయించుకునే ఆలోచన చేస్తే.. ఆయన రాజకీయం ఉన్నతంగా ఉండేది. కానీ చేస్తున్నదంతా .. తప్పుడు ఆలోచనలు కావడంతోనే సమస్యలు వస్తున్నాయి. ఏపీ ప్రజలు ఇప్పుడు 360 ప్రోఫైలింగ్లో ఉన్నారు. ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన ఎవరి జీవితాలు సోషల్ మీడియాకు ఎక్కుతాయో చూస్తూ ఉండాలి.
ప్రజల వ్యక్తిగత సమాచారం అంతా లాగేసిన జగన్ రెడ్డి గత ఎన్నికలకు ముందు … చంద్రబాబు ప్రభుత్వంపై డేటాచోరీ పేరుతో చేసిన హడావుడి గుర్తు చేసుకుంటే… హమ్మ దొంగ అనుకోక తప్పదు. ఆ డేటా చోరీ కేసు పచ్చి అబద్దమని తేలింది. కానీ ఇప్పుడు దాన్ని జగన్ రెడ్డి నిజం చేసి చూపించారు. ఇదంతా ప్రజలు నెత్తిన తెచ్చిపెట్టుకున్న అదృష్టమే !