కల్లాం అజేయరెడ్డి అలియాస్ అజేయకల్లాం దుస్థితిపై ఇప్పుడు ఏపీ ఐపీఎస్ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మామూలుగా లేదు. అతిగా ఆశపడితే అలా గడ్డం పెంచుకుని అధ్యాత్మిక జీవనానికి వెళ్లినా తప్పుడు పనులు చేయాల్సిందేనని సెటైర్లు వేసుకుంటున్నారు. తనను వివేకా హత్యకేసులో పావుగా వాడుకుంటారని ఆయన అసలు ఊహించి ఉండరని ఇప్పుడు ఆయన ఎటూ పోలేని స్థితికి వెళ్లిపోయాడని .. జాలి చూపిస్తున్నారు.
ఏ ఐపీఎస్ అధికారికి అయినా సీఎస్‌గా రిటైరవ్వాలన్నది కల. సీఎస్ పోస్టు ఖాళీ అయినప్పుడు సీఎం చంద్రబాబు కనీసం రెండేళ్ల సర్వీస్ ఉన్న వారిని చూసుకోకుండా.. . అజేయకల్లాంకు నెల రోజులే గడువు ఉన్నా సీఎస్‌ను చేశారు. కేంద్రానికి పొడిగింపు ప్రతిపాదన పంపారు. కానీ అప్పట్లో కేంద్రంతో సంబంధాలు చెడిపోవడంతో… అనుమతి రాలేదు. కానీ సీఎస్‌ను చేశారన్న కృతజ్ఞత లేకుండా పొడిగింపు ఇవ్వలేదన్న కసితో.. జగన్ రెడ్డి పంచన చేరారు కల్లాం అజేయరెడ్డి. ప్రభుత్వంపై ఎన్ని తప్పుడు ఆరోపణలు చేయాలో.. ఎలాంటి ప్రచారం చేయాలో అంతా చేశారు. ప్రభుత్వాన్ని ఓడించడంలో తన వంతు ప్రయత్నం చేశారు.
కానీ ఆయన చేసిన ఆరోపణల్లో ఒక్కటీ నిరూపించలేకపోయారు. పీపీఏలు పాతికేళ్ల పాటుఒప్పందాలా భారీ అవినీతి అని చెప్పారు.. కానీ ఇప్పుడు జగన్ రెడ్డి 30ఏళ్ల పాటు ఒప్పందాలు చేసుకోవడానికి ఆయనే సలహాదారు. వీటిని పక్కన పెడితే వ్యక్తిగతంగా ఆయన ఇప్పుడు ఓ హత్య కేసులో పావుగా మారాడు. అసలు పొద్దున్నే జగన్ రెడ్డి మీటింగ్ పెట్టరు.. కానీ నాలుగున్నర.. ఐదున్నరకు మీటింగ్ పెట్టి అజేయకల్లాంను పిలిచి.. వివేకా కేసులో వ్యూహాత్మకంగా సాక్షిని చేశారు. ఇప్పుడది రివర్స్ అవుతోంది.
పదే పదే మాట మార్చి .. అనేక అనుమానాలకు కారణం అవుతున్నాడు. నిజానికి ఆయనను ఎప్పుడో సలహాదారు పదవి నుంచి తీసేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఆయన అమరావతిలోకనిపించడం లేదు. గడ్డం పెంచుకుని అథ్యాత్మిక జీవనంలో ఉన్నారు . కానీ ఇప్పుడు తప్పనిసరిగా కొనసాగిస్తున్నారు. వారు చెప్పినట్లుగా చేయాల్సి వస్తోంది. ముందు ముందు కల్లాంకు మరింత మానసిక అశాంతి ఖాయంగా కనిపిస్తోందని.. పాపం అంటున్నారు కొలీగ్స్.