ఎన్నికలకు ముందు తెలంగాణ సీఎం కేసీఆర్ అసాదారణ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆర్టీసీ విలీనం సాధ్యమే కాదన్న ఆయన ఇప్పుడు ఎవరూ అడగకపోయినా … ఆర్టీసీ ని ప్రభుత్వ ఉద్యోగాల లో విలీనం చేస్తున్నట్టు ప్రకటించారు. హైదరాబాద్ చుట్టూ 69వేల కోట్ల తో మెట్రో ను మూడు నుంచి ఐదేళ్లలోపూర్తి చేస్తామన్నారు. వరంగల్ కు ఎయిర్ పోర్టు.. ఇతర వరాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయాలు అమలయ్యేది ఇప్పుడు కాదు.. ఎన్నికల తర్వాతే. ఆర్టీసీ విలీనాన్ని పూర్తి చేస్తామని చెబుతున్నారు కానీ అవుతుందో లేదో చెప్పడం కష్టం. డిసెంబర్ లో ఎన్నికలు ఉన్నాయి. అక్టోబర్లోనే ఎన్నికల షెడ్యూల్ వస్తుంది. అంటే షెడ్యూల్ రావడానికి గట్టిగా మూడు నెలల సమయం కూడా లేదు. ఈ లోపు ఆర్టీసీ విలీనం అవుతుందా అన్నదే సమస్య. అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆమోదించినా… ఎక్కడో చోట లిటిగేషన్ వచ్చేలా చేస్తే ఆగిపోతుంది.
కేసీఆర ఇటీవలి కాలంలో ఎన్నికల గురించే ఆలోచిస్తున్నారు. వరదలు వచ్చినా పట్టించుకోవడం లేదు. ఫామ్ హౌస్లో వారం రోజుల పాటు కసరత్తు చేసి ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్న వర్గాలను గుర్తించి వారిని ఐస్ చేసేందుకు కొత్త నిర్ణయాలు తీసుకున్నట్లుగా చెబుతున్నారు. ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నట్లుగా తేలడంతో…. గతంలో వారి పట్ల వ్యవహరించిన తీరు కఠినంగా ఉండటంతో … వారిని మంచి చేసుకోవాలంటే… ఆర్టీసీ విలీనం ఒక్కటే మార్గమని కేసీఆర్ నిర్ణయానికి వచ్చినట్లుగా చెబుతున్నారు.
హైదరబాద్ తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో బీఆర్ఎస్ కు గడ్డు పరిస్థితి ఉన్నట్లుగా సర్వేల్లో తేలిపింది. కేసీఆర్ రాజకీయాల వల్ల కొన్ని వర్గాలు దూరం కావడంతో … వారందర్నీ మళ్లీ మనగ చెట్టు ఎక్కించాలంటే.. ఈ ప్రభుత్వం ఉంటే ఎంతో మేలు జరుగుతుందన్న భావన కల్పించడానికి ప్రయత్నిసంచారు. మెట్రో 400 కిలోమీటర్ల మేర మూడేళ్లలో నిర్మించడం అసాధ్యం. పైగా మొత్తం గ్రేటర్… ను కవర్ చేసేలా నిర్మిస్తామంటున్నారు. ఇదేమంత నమ్మశక్యంగా లేదని ఎక్కువ మంది భావిస్తున్నారు.. కేసీఆర్ నిర్ణయాల వెనుక ఖచ్చితంగా ఎన్నికల భయం ఉందన్న వాదన వినిపిస్తోంది.
కొసమెరుపేమిటంటే… వరద నష్టంకు తక్షణ సాయంగా ఐదు వందల కోట్లు విడుదల చేస్తున్నట్లుగా చెప్పారు కానీ…. ఎకరానికి ఎంతిస్తారు.. ఇళ్లు కోల్పోయిన వారికి ఎంతిస్తారు… తుడిచిపెట్టుకుపోయినా గ్రామాల సంగతేంటి అన్నది మాత్రం చెప్పలేదు.