అధికారులను ఇష్టనుసారంగా వాడుకున్న జగన్ రెడ్డి .. వారు చుక్కలు చూపించడానికి సిద్ధమవుతున్నారు. నిబంధనలు.. చట్టాలు పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా అందర్నీ ఉపయోగించుకున్నారు. ఇప్పుడు వారిలో అత్యధిక మింది తమ రక్షణ కోసం అయినా రాజకీయాల్లోకి పిలవాలని టిక్కెట్లు ఇచ్చి గెలిపించాలని.. అంటున్నారు. కాదంటే వారే జరిగిన విషయాన్ని కథలు కథలుగా చెబితే మొదటికే మోసం వస్తుంది.
సీఎం జగన్ రెడ్డి స్టైల్ ఆఫ్ వర్కింగ్ లో ఎక్కువ మందిని అడ్డగోలుగా ఉపయోగించుకుంది ఎస్సీ, ఎస్టీ అధికారుల్నే. పేరుకు వారిని ముందు పెట్టి సలహాదారులతో కథ నడిపించారు. ఇప్పుడు ఆ అధికారంలతా.. మీరు చేసిన తప్పులకు మేము బలికాలేము.. ఇప్పుడు ఖచ్చితంగా సీటివ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. వారి పేరుతో చేసిన అక్రమాల స్థాయిలను బ్టటి టిక్కెట్లు ఇవ్వడానికి జగన్ రెడ్డి కూడా రెడీ అవుతున్నారు.
ఇప్పటికే విజయ్ కుమార్ అనే ఆయన పాదయాత్ర కూడా చేస్తున్నారు. పీవీ సునీల్ కుమార్ చేసిన రచ్చ గురించి చెప్పాల్సిన పని లేదు. ఆయన కూడా అమలాపురం నుంచి పని చేసుకుంటున్నారు. ఆయనకో క్రిస్టియన్ సంస్థ కూడా ఉంది. దాంతో పని చేయించుకుంటున్నారు. తాజాగా కరికాల పళవన్ అనే పెద్దాయన కూడా తిరుపతి టిక్కెట్ మీదగురి పెట్టారు. మరో ఐదారుగురు అధికారులు ఇదేపనిలో ఉన్నారు.
అధికారుల నుంచి వస్తున్న టిక్కెట్ల ఒత్తిళ్లు చూసి వైసీపీలోనే ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. వాళ్లందరి పేరుతో చేసిన అక్రమాల వల్ల ఎంత లాభం పొందారో కానీ.. ఇప్పుడు వారి కోరికలు తీర్చకపోతే మొదటికే మోసం వస్తుందని కంగారు పడుతున్నారు.