బ్రోకి ఎంత ఖర్చయ్యింది? ఎంతొచ్చింది? పవన్‌కి ఎంతిచ్చారు? జీఎస్టీ కట్టారా, లేదా? ఇదీ… అంబటి రాయుడు బ్రో నిర్మాతపై సంధించిన ప్రశ్నలు. వీటికి నిర్మాత టి.జి.విశ్వ ప్రసాద్ కూడా నేరుగా సమాధానం ఇచ్చేశారు. `ఈ లెక్కలు ఎవరికీ చెప్పాల్సిన అవసరం మాకు లేదు` అని ఒక్క మాటలో తేల్చేశారు. ఈ లెక్కలన్నీ జీ టీవీకీ తమకీ మధ్య ఉంటాయని, వాటిని ఎవరో అడిగారని, బయట పెట్టాల్సిన అవసరం లేదన్నారు. పవన్‌కి ఎంతిచ్చామన్నది కూడా అంతర్గత విషయమని, ఒకవేళ తన పారితోషికం ఎంతన్నది పవన్ తనకు తాను చెప్పుకొంటే అది పూర్తిగా ఆయన ఇష్టమన్నారు. తమకొచ్చిన మొత్తానికి జీఎస్టీ కట్టామని, ఇచ్చిన పారితోషికాలకూ జీఎస్టీ చెల్లించామని, చిత్ర రంగంలో సుదీర్ఘకాలం ఉండాలన్న ఆశయంతో వచ్చాం కాబట్టి, లెక్కా పత్రాలు పక్కాగా ఉంటాయని క్లారిటీ ఇచ్చారు. అంబటి ఆరోపణలు వాస్తవం కాదని, ఆయన గాల్లో లెక్కలు వేస్తున్నారని కౌంటర్ ఇచ్చారు.
బ్రో సినిమాని ఇంత వరకూ దర్శక నిర్మాతలు మోశారు. ఇప్పుడు వైకాపా నాయకులు మోస్తున్నట్టుంది వ్యవహారం. ఈ సినిమాపై గత రెండు మూడు రోజులగా అంబటి రాంబాబు ప్రెస్ మీట్లు పెడుతూనే ఉన్నాడు. బ్రో నిర్మాతనీ ఆయన వదల్లేదు. ఈ సినిమా లెక్కలు చెప్పాల్సిందే అని ఆయన నిలదీశారు. దీనిపై టీజీ విశ్వప్రసాద్ కూడా పాయింట్ టూ పాయింట్ ఆన్సర్ ఇచ్చారు. భీమ్లా నాయక్, వకీల్ సాబ్ కంటే ముందు పవన్ డేట్లు ఖరారు అయ్యాయని, పవన్ ఇచ్చిన డేట్ల ప్రకారం సినిమా పూర్తి చేశామని, పవన్ స్థాయికి తగ్గట్టుగానే బిజినెస్ జరిగిందని, నిర్మాతలుగా తాము సేఫ్ అని మీడియా ముఖంగా సమాధానం ఇచ్చారు. దాంతో నిర్మాతలు లాస్ అయ్యారన్న అంబటి వ్యాఖ్యలు గాలి వార్తలే అని తేలిపోయింది.