తెలంగాణ సీఎం కేసీఆర్ ఎన్నికలకు ముందు విశ్వరూపం చూపిస్తున్నారు. గత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్ని రోజుకు ఒకటి చొప్పున నెరవేరుస్తున్నట్లుగా ప్రకటిస్తున్నారు. నాలుగున్నరేళ్ల కిందట రైతులకిచ్చిన ఎన్నికల హామీని నెరవేర్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేసింది. అప్పట్లో కాంగ్రెస్ రెండు లక్షల రుణమాఫీ అంటే.. బీఆర్ఎస్ తాము లక్ష రుణమాఫీ చేస్తామని ప్రకటించింది. ఇప్పటి వరకూ చేయలేదు. ఇప్పటి వరకూ మొత్తం 5.42 లక్షల మందికి చెందిన రూ.1,207 కోట్ల రుణాలను మాఫీ చేసింది. మిగిలిన 37 వేల నుంచి 90 వేల లోపు గల రుణాలను మాఫీ చేయాల్సి ఉంది. ఇందు కోసం 19 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ చాలా రోజులుగా ఎన్నికలకు కసరత్తు చేస్తున్నారు. తన పార్టీకి ఎక్కడెక్కడ మైనస్ ఉందో సర్వేల మీద సర్వేలు చేయించుకుని దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నారు .. ఆర్టీసీ ఉద్యోగుల్లో వ్యతిరేకత ఉందని తేలిన తర్వాత.. విలీనం నిర్ణయంతో సరి పెట్టారు. అనూహ్యంగా గ్రేటర్ హైదరాబాద్ … ముఖ్యంగా శివారు ప్రాంతాల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని నివేదికలు వచ్చిన తర్వాత కేసీఆర్ అందుకు గల కారణాలపై పూర్తి స్థాయిలో విశ్లేషణ జరిపి అందర్నీ కూల్ చేయడానికి మెట్రో ఒక్కటే మార్గమనే నిర్ణయానికి వచ్చినట్లుగా చెబుతున్నారు. అలా దళిత బంధు, బీసీ బంధు, మైనార్టీ బంధు వంటి పథకాలను ప్రారంభించారు.
ఇంత కాలం రుణమాఫీ చేయకపోవడానికి కేంద్రం కారణం అని ప్రకటించారు కేసీఆర్. అప్పులు తీసుకోకుండా అడ్డుకోవడమే కారణం అన్నారు. మరి ఇప్పుడు కేంద్రం అనుమతించిందా అన్నదే ప్రశ్న. నిధుల సమీకరణ ఎలా అన్నది మిస్టరీగా మారింది. ఇప్పటికే పెద్ద ఎత్తున పథకాలకు నిధులు పెండింగ్లో ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్ మినహా జిల్లాల్లో ఉన్న ఉద్యోగులకు జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి ఉంది. మరి వేల కోట్లు ఎలా సమీకరిస్తారన్నది కీలకంగా మారింది. ఎంత భూములు అమ్మినా.. కార్పొరేషన్ రుణాలు తెచ్చినా నిధులు సర్దుబాటు కష్టమే. కానీ కే్సీఆర్ ఏదో మాయ చేయాలనుకుంటున్నారని బీఆర్ఎస్ వర్గాలనుకుంటున్నాయి. ఎన్నికల్లో ఓటింగ్ జరిగే నాటికి హామీలన్నీ పూర్తి కాకపోతే.. ప్రజల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది.