ఫ్యాక్షన్ వర్గాలను ఏకతాటిపైకి తెచ్చానని జమ్మలమడుగులో టీడీపీకి తిరుగు ఉండదని చంద్రబాబు గత ఎన్నికల్లో అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఆ రెండు ఫ్యాక్షన్ వర్గాల్ని కాకుండా వైసీపీ అనామక అభ్యర్థికి యాభై వేలకుపైగా మెజార్టీతో జమ్మలమడుగు ప్రజలు గెలిపించారు. దీంతో.. ఆ రెండు ఫ్యాక్షన్ వర్గాలూ టీడీపీకి దూరమయ్యాయి. ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరిపోగా.. రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరిపోయారు.
గత ఎన్నికల తర్వాత ఆదినారాయణరెడ్డి అప్పట్లో టీడీపీకి గుడ్ బై చెప్పారు. 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా కాకుండా కడప జిల్లా ఎంపీగా పోటీచేసి ఘోర పరాజయం పాలయ్యారు. పైగా టీడీపీ అధికారంలోకి రాకపోవడం, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో ఆదినారాయణ రెడ్డిపైనా వైసీపీ నాయకులు ఆరోపణలు రావడంతో సైకిల్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన సోదరుడు మాత్రం సైకిల్ పార్టీనే నమ్ముకుని ఉన్నారు. ఆదినారాయణ రెడ్డి కూడా తన రాజకీయ వారసుడిగా తన అన్న కుమారుడు భూపేష్ రెడ్డినే ప్రకటించారు. అందుకే రానున్న ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీచేయాలని విస్తృతంగా జనాల్లో తిరుగుతున్నారు. ఇప్పుడు ఆయనకే చంద్రబాబు అభ్యర్థిత్వం ఇచ్చారు.
అయితే ఆదినారాయణరెడ్డి బీజేపీలో అంత చురుగ్గా లేరు. ఆయన సోదరుడు మాత్రం టీడీపీలోనే ఉండిపోయారు. ఆయన కుమారుడు భూపేష్ రెడ్డి చురుగ్గా జమ్మలమడుగులో పర్యటిస్తున్నారు. ఆయన ఇంచార్జ్ కూడా. ఆయననే అభ్యర్థిగా చంద్రబాబు ప్రకటించారు. భూపేష్ రెడ్డే తన రాజకీయ వారసుడు అని గతంలోనే ఆదినారాయణరెడ్డి ప్రకటించారు. అందుకే.. కొన్ని కారణాల వల్ల బీజేపీలో ఉన్నప్పటికీ.. ఆదినారాయణ సహకారం కూడా భూపేష్కే ఉంటుందని అంచనా వేస్తున్నారు.