ఎన్నికలను ఎదుర్కోవడానికి కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలకు అడ్డు వస్తున్న నిధుల సమస్యను అధిగమించేందుకు కేసీఆర్ వినూత్న ప్రయత్నాలు చేస్తున్నారు. డిసెంబర్‌తో ముగిసిపోయే లిక్కర్ షాపుల గడువుకు .. జూలైలోనే మళ్లీ టెండర్లు పిలవడానికి ఏర్పాట్లు చేసేశారు. దీనికి నోటిఫికేషన్ జారీ చేశారు. గురువారం షాపుల రిజ్వర్వేషన్లపై కలెక్టర్లు డ్రా తీయనున్నారు. శుక్రవారం నుంచి కొత్త దరఖాస్తులను స్వీకరించేందుకు ఏర్పాట్లు చేశారు. దీనికి సబంధించి ఈనెల 18వ తేదీ వరకు దరఖాస్తులను అందజేయాల్సి ఉంటుంది.
రాష్ట్రంలోని 2,620 మద్యం షాపులకు దరఖాస్తులను ఆహ్వానించారు. దీని ద్వారా 2023 నుంచి 2025 వరకు రెండేళ్ల ఎక్సైజ్ పాలసీ అమల్లోకి రానుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న పాలసీలో ఎలాంటి మార్పులు చేయకుండానే కొత్త పాలసీని అమలు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుత వైన్ షాపుల లైసెన్సు గడువు ఈ నవంబరు 30తో ముగియనుంది. 2023 డిసెంబరు 1 నుంచి కొత్త లైసెన్సు షాపులు అమల్లోకి రావాల్సి ఉంది. వీటికి అక్టోబర్‌లో నోటిఫికేషన్ జారీ చేసి, నవంబరుకల్లా లైసెన్స్ ఇవ్వాల్సి ఉంది. కానీ.. ఎన్నికల హామీైలకు నిధులు అవసరం అయినందున మూడు నెలలు ముందుగానే నోటిఫికేషన్‌ను జారీ చేసింది.
గతంలో అయితే ప్రస్తుతం ఉన్న షాపులకు ఒకటి, రెండునెలలు రెన్యువల్చేసేవాళ్లు. ఇప్పుడు మూడు నెలల ముందుగానే ప్రక్రియ ప్రారంభించారు. ముందస్తుగా షాపులను ఎంపిక చేయడం ద్వారా ప్రభుత్వానికి ఆగస్టులోనే లైసెన్సు ఫీజు మొదటి వాయుదా సొమ్ము అందనుంది. గ దాదాపు రూ.2000 కోట్ల దాకా ప్రభుత్వానికి వచ్చే అవకాశముంది. ఆ సొమ్మును ఎన్నికల ముందు ఏవైనా పథకాలకు వినియోగించుకోవాలన్నది సర్కారు ప్లాన్ అనిచెప్పాల్సిన పని లేదు. లిక్కర్ పాలసీ అమల్లోకి వచ్చే నాటికి తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడాల్సి ఉంది.