చినబాబు చిరుతిండి అని తప్పుడు వార్తలు రాసినందుకు విశాఖ కోర్టు బోనులో నిలబడిన సాక్షి.. ఇప్పు మరోసారి తనపై రాసిన తప్పుడు వార్తల కారణం మంగళగిరి కోర్టులో నిలబడాల్సి వస్తోంది. స్కిల్ డెలవప్మెంట్ లో భారీ స్కాం జరిగింది ఇదిలోకేషే చేశాడంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తూ ఉండేవారు. వాళ్లూ వీళ్లు సంగేతమో కానీ.. స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ గా పదవి పొందిన అజయ్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరీ అదే ఆరోపణలు చేశారు. దాన్ని సాక్షి పుంఖాను పుంఖానులుగా రాసింది.
వెంటనే చేసిన ప్రచారానికి.. ఆరోపణలకు సాక్ష్యాలివ్వాలని లేకపోతే..క్రిమిలన్ కేసు దాఖలు చేస్తానని లోకేష్ నోటీసులు పంపారు. ఈ నోటీసులకు అజయ్ రెడ్డి నుంచి కానీ ఇటు సాక్షి పత్రిక నుంచి కానీ రెస్పాన్స్ లేదు. నిజానికి ఆ ఆరోపణల్లో పిసరంత అయిన నిజం ఉంటే… కోర్టులోనే తేల్చుకుంటామని.. భీకరమైన ప్రకటనలు చేసి ఉండేవారు. కానీ తేలుకుట్టిన దొంగల్లా ఉండిపోయారు. నోటీసులకు కూడా స్పందించలేదు. దీంతో లోకేష్ మంగళగిరి కోర్టులో క్రిమినల్ కేసు పిటిషన్ దాఖలు చేశారు. వాంగ్మూలం ఇచ్చేందుకు శుక్రవారం మంగళగిరి కోర్టుకు వెళ్లనున్నారు.
ఇంతకు ముందు గుర్రంపాటి దేవందర్ రెడ్డి, పోతుల సునీతలపైనా ఇలాగే తప్పుడు ఆరోపణలకు నోటీసులు జారీ చేసినా స్పందించకపోవంతో వారిపైనా క్రిమినల్ డిఫమేషన్ పిటిషన్లు దాఖలు చేశారు. తనవాంగ్మూలాన్ని ఇచ్చారు.