బ్రో.. రెండో వారంలో అడుగు పెట్టింది. తొలి మూడు రోజులూ ఉన్న జోరు, ఆ తరవాత లేదు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్కి చేరుకోవడం కష్టమే అని ట్రేడ్ వర్గాలూ తేల్చేశాయి. ఏపీ మంత్రులైతే, సినిమా రిపోర్టర్ల అవతారాలు ఎత్తి, బ్రో కలక్షన్లని అంకెలతో సహా చెబుతున్నారు. అయినా ఈ సినిమాని సాయిధరమ్ తేజ్ తన భుజాలపై వేసుకొని మోస్తూనే ఉన్నాడు. ఏపీలోని కొన్ని థియేటర్లకు సాయితేజ్ టూర్లు వేస్తున్నాడు. తేజ్ వెళ్లిన చోటల్లా ఆదరణ బాగుంటోంది. కానీ.. దీని వల్ల సినిమాకొచ్చిన మైలేజీ ఏం లేదు. ఆల్రెడీ కలక్షన్లు డ్రాప్ అయిపోయాయి. రోజు రోజుకీ పడిపోతున్నాయి. ఇలాంటప్పుడు.. టూర్లు వేయడం వల్ల వచ్చిన లాభమేంటో అర్థం కావడం లేదు. నిజానికి పవన్ కల్యాణ్ లాంటి హీరో సినిమాకి, థియేటర్లకు వెళ్లాల్సిన పనిలేదు. కానీ.. ఎట్టిపరిస్థితుల్లోనూ, ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోకూడదని చిత్రబృందం ప్రయత్నం చేస్తోంది. ఈ సినిమాని తేజ్ ఎమోషనల్ గా తీసుకొన్నట్టు అనిపిస్తోంది. మావయ్యతో కలిసి చేసిన సినిమా ఇది. అందుకే.. వీలైనంత వరకూ పబ్లిసిటీ చేద్దామని ఫిక్సయ్యాడు. బ్రో సక్సెస్ మీట్లో పవన్, త్రివిక్రమ్ ఇద్దరూ కనిపించలేదు. తేజ్ ఒక్కడే వచ్చాడు. ఇప్పుడు కూడా అంతే. తానొక్కడే ఈ సినిమా కోసం టూర్లు వేస్తున్నాడు. కానీ ఫలితం మాత్రం కనిపించడం లేదు.