అధికార యంత్రాంగం మొత్తాన్ని మార్గదర్శిపై ప్రయోగించి.. ఏదో చేయాలనుకుంటున్న జగన్ రెడ్డి సర్కార్ కుట్రలు న్యాయస్థానాల్లో తేలిపోతున్నాయి. తెలంగాణ హైకోర్టులో మార్గదర్సి కేసుల విచారణ సాధ్యం కాదని.. ఏపీ హైకోర్టుకు మార్చాలని .. జగన్ రెడ్డి సర్కార్ పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టు నిర్మోహమాటంగా కొట్టేసింది. మార్గదర్శి కేసులను విచారించే న్యాయపరిధి తెలంగాణ హైకోర్టుకు లేదన్న ఏపీ ప్రభుత్వ వాదనను తోసిపుచ్ిచంది.
న్యాయపరిధి విషయాన్ని హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన బదిలీ పిటీషన్లు కాలం చెల్లినవని చెప్పిన సుప్రీంకోర్టు …మార్గదర్శి ఎండి శైలజాకిరణ్ పై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. మెరిట్స్ ఆధారంగా ఈ కేసును విచారించి నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ హైకోర్టుకు సూచించింది.
మార్గదర్శి చిట్ పండ్స్ కేసుల విషయంలో ఏపీ ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తోంది. ఒక్క ఫిర్యాదుదారు లేనప్పటికీ సంస్థ అవకతవకలకు పాల్పడుతోందని నగదు మళ్లిస్తోందని ఆరోపిస్తూ.. సోదాలు నిర్వహించారు. అలాగే చిట్స్ ను మూసేయడానికి .. చందాదారులకు బహిరంగనోటీసులు జారీ చేశారు. రాజకీయంగా కుట్ర చేసి వ్యాపార సంస్థను మూసి వేయడానికి జరుగుతున్న కుట్రగా మార్గదర్శి ఆరోపిస్తోంది. ఇంత వరకూ మార్గదర్శి విషయంలో ఫలానా తప్పు జరిగిందని.. ప్రభుత్వం నిరూపించలేకపోయింది. ప్రభుత్వ ప్రతి వాదనకూ మార్గదర్శి జవాబిస్తోంది.