పుంగనూరులో చంద్రబాబు పర్యటన సందర్భంగా తీవ్రఉద్రిక్త ఏర్పడింది. వైఎస్ఆర్సీపీ నేతలు, పోలీసులు కలిసి చేసిన రాజకీయంతో అల్లర్లు చెలరేగాయి. చంద్రబాబు పర్యటనను వ్యూహాత్మకంగా అడ్డుకుని ప్రాజెక్టుల వద్దకు వెళ్లకుండా అరాచకం జరిగినా పర్వాలేదని వ్యూహాత్మకం చేసిన కుట్రలు చేశారు. చివరికి చంద్రబాబు రెచ్చగొట్టడం వల్లే అల్లర్లు జరిగాయంటూ ఎస్పీ రిషాంత్ రెడ్డి.. అంతకు ముందే సజ్జల మీడియాతో మాట్లాడిన మాటలను తన మాటలుగా చిత్తూరులో చెప్పుకొచ్చారు.
చంద్రబాబు పుంగనూరు పర్యటనను అడ్డుకునేందుకు ఉదయం నుంచి వైసీపీ కార్యకర్తలు రోడ్ల మీదకు వచ్చారు. అంగళ్లు అనే గ్రామం వద్ద మోహరించారు. పెద్ద ఎత్తున కర్రలు, రాళ్లతో రోడ్డును బ్లాక్ చేశారు. అయినా పోలీసులు చర్యలు తీసుకోలేదు. చంద్రబాబు వచ్చే సమయానికి తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. చంద్రబాబుపై రాళ్లు కూడా వేశారు. అయినా పోలీసులు నటిస్తూనే ఉన్నారు. ఎదురుగా టీడీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఇక్కడ ఉద్రిక్తత ఏర్పడిందని.. చంద్రబాబును పుంగనూరులోకి రానీయకుండా.. బైసాస్ రోడ్ మీదుగా పోలీసులు దారి మళ్లించారు.ఇందు కోసం వజ్ర వాహనాల్ని, బస్సుల్ని అడ్డం పెట్టారు.
పుంగనూరులో పెద్దఎత్తున చంద్రబాబు కోసం ఎదురు చూస్తున్న కార్యకర్తలను చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ .. రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించారు. దీంతో ఒక్క సారిగా పరిస్థితి అదుపు తప్పింది. టీడీపీ కార్యకర్తలు ఎదురుదాడి చేశారు. పోలీసులకు వైసీపీ కార్యకర్తలు తోడవడంతో ఇద్దరూ కలిసి టీడీపీ కార్యకర్తలపై పై రాళ్ల దాడి చేశారు. ఈ క్రమంలో టీడీపీ కార్యకర్తలు దూసుకొచ్చారు. రెండు పోలీసు వాహనాలకు నిప్పు పెట్టారు.
ఈ ఘటనపై స్పందించిన రిషాంత్ రెడ్డి.. తంబళ్లపల్లె ఎమ్మెల్యేను చంద్రబాబు రావణ అని సంబోధించడంతో వైసీపీ కార్యకర్తలకు కోపం వచ్చిందన్నారు. చంద్రబాబు వైసీపీ కార్యకర్తలు పోలీసులు, డీఎస్పీపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని.. దాడులుక పురికొల్పారని చెప్పుకొచ్చారు. మొత్తంగా చంద్రబాబు పర్యటిస్తే ఎక్కడ తమ బండారం బయటపడుతుందోనని వ్యూహాత్మకంగా విధ్వంసం సృష్టించారన్న అనుమానాలు బలపడుతున్నాయి.