ఉమ్మడి రాష్ట్ర విప్లవ గొంతుల్లో ప్రముఖమైన గద్దర్ గొంతు మూగబోయింది. గుండె సంబంధిత వ్యాధితో పది రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన చనిపోయారు. ప్రజా యుద్ధనౌకగా పేరొందిన గద్దర్.. పీపుల్స్ వార్, అనంతరం మావోయిస్టు, తెలంగాణ ఉద్యమాల్లో తన గళంతో కోట్లాది మంది ప్రజలను చైతన్యవంతం చేశారు.
1949 తూఫ్రాన్ లో జన్మించిన గద్దర్ గద్దర్ అసలు పేరు గుమ్మడి విఠల్ రావు…తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. తన పాటలతో ఉద్యమాలకు ఊపుతెచ్చారు. 1987లో కారంచేడు దళితుల హత్యలపై గద్దర్ అవిశ్రాంతంగా పోరాటం చేశారు. నకిలీ ఎన్కౌంటర్లను తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ క్రమంలోనే 1997 ఏప్రిల్ 6న గద్దర్‌పై హత్యాయత్నం జరిగింది. అమ్మ తెలంగాణమా, పొడుస్తున్న పొద్దుమీద పాటలతో ఉద్యమాలకు ఊపుతెచ్చిన గద్దర్. నీ పాదం మీద పుట్టుమచ్చనై పాటకు నంది అవార్డుకు ఎంపికయ్యారు. కానీ నంది అవార్డును తిరస్కరించారు.
ఇటీవల తన పంధా నుంచి బయటకు వచ్చారు. రకరకాల రాజకీయ పార్టీలతో కలుస్తున్నారు. సొంత పార్టీని కూడా ఏర్పాటు చేశారు. అయితే ఆయన ఎలాంటి రాజకీయాలు చేసినా… తెలంగాణలో ఉన్న వారంతా భావజాలలతో సంబంధం లేకుండా ఆయనను అభిమానిస్తారు. గద్దర మరణంపై తెలంగాణలో దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది.
ఇటీవల ఆయన ఆస్పత్రిలో ఉన్నప్పుడు పలువురు పరామర్శించారు. పవన్ కల్యాణ్ కూడా పరామర్శించారు.