ఎన్నికలకు వెళ్లబోయే ముందు అసెంబ్లీలో కేసీఆర్ చేసిన ప్రసంగం.. పూర్తిగా కాంగ్రెస్ ను టార్గెట్ చేసుకుని సాగింది. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ను.. ఆయన.. తెలంగాణ ద్రోహిగా ముద్ర వేసేందుకు అసాంతం ప్రయత్నిచింది. ఉన్న తెలంగాణన ఊడగొట్టింది.. ముంచింది కాంగ్రెస్ పార్టీయేనని తేల్చేశారు. ప్రతీ దానికి బీజేపి.. నెహ్రూతో లింక్ పెడుతూ ఉంటుంది . కేసీఆర్ కూడా … వారిని సంతృప్తి పరిచేందుకు నెహ్రూ ప్రస్తావన తీసుకు వచ్చారు. ఉన్న తెలంగాణను ఊడగొట్టింది ఇదే కాంగ్రెస్ పార్టీ. జవహర్లాల్ నెహ్రూ అని స్పష్టం చేశారు. ఎవరెన్ని చెప్పినా తొమ్మిదేళ్లలో ప్రపంచంలోనే అద్భుతంగా అభివృద్ధి చెందింది తెలంగాణ అని కేసీఆర్ స్పష్టం చేశారు.
జవహర్లాల్ నెహ్రూ ఆధ్వర్యంలో ఆ రోజు తెలంగాణ విద్యార్థులు, మేధావులు, ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆనాడు ఉన్న కొండ వెంకటరంగారెడ్డి, బూర్గుల రామకృష్ణారావు వ్యతిరేకించినా ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ. మాట్లాడితే భట్టి విక్రమార్క ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అంటరు. ఆ పార్టీ మన కొంపముంచుకుంది. తెలంగాణను ముంచిందే కాంగ్రెస్. ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ. ఇది చరిత్రలో రికార్డయ్యింది. ఇది కల్పిత కథ కాదు. ఆ విధంగా ఉన్న తెలంగాణను ఊడగొట్టింది కాంగ్రెస్ అని నిందించారు. ఉద్యమాలు జరిగినప్పుడల్లా కాంగ్రెస్ పార్టీనే అణిచి వేసిందన్నారు.
1969లో చెన్నారె తెలంగాణ డెమొక్రటిక్గా 14 ఎంపీ స్థానాల్లో 11 మందిని గెలిపించి.. యావత్ తెలంగాణ మా తెలంగాణ మాకు కావాలి అంటే.. ఆ నాడు ఇందిరాగాంధీ నో తెలంగాణ అని నిరాకరించారన్నారు. ఇవన్ని పునశ్చరణ చేసుకోక తప్పదు. తెలంగాణ సమాజానికి జ్ఞప్తికి తేవాల్సిన అవసరం ఉందన్నారు.
మొత్తంగా కాంగ్రెస్ ను నిందించిన కేసీఆర్.. పనిలో పనిగా తెలంగాణ అభివృద్ధి గురించి కూడా చెప్పారు. మన తలసరి ఆదాయం రూ.3.12లక్షల ఉంటే.. మనం ఏ రాష్ట్రం నుంచి మనం విడిపోయామో.. ఎవరైనా మనల్ని ఎకసెక్కాలు పలికారో.. మీకు పరిపాలన రాదు అన్నరో వారి తలసరి ఆదాయం రూ.2.19లక్షల అని ఏపీ గురించి ఎగతాళి చేశారు. మహా నగరాలుఉన్న రాష్ట్రాల్ని తలదన్ని ఎక్కువ మొత్తంలో తలసరి ఆదాయం ఎక్కువ అనేది నిజమన్నారు.
తెలంగాణ ఇచ్చిన పార్టీ అనే భావన లేకుండా.. చేయడానికి కేసీఆర్ పూర్తిగా కాంగ్రెస్ పార్టీనే నిందించారని భావిస్తున్నారు. బీజేపీని ఏమీ అనకపోవడం మాత్రం.. అనూహ్యంగా మారింది.