చంద్రబాబుపై వరుసగా హత్యాయత్నాలు జరుగుతున్నాయని 70 ఏళ్లకుపైగా వయసున్న చంద్రబాబుపై పదునైన రాళ్లతో దాడి చేసి చంపాలని ప్రయత్నిస్తున్నారని నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ బృందం తమ ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్లుగా తెలుస్తోంది. చంద్రబాబుపై రాళ్ల దాడి జరగడం ఇదే మొదటి సారి కాదు. మార్కాపురంలోనూ వ్యూహాత్మకంగా చంద్రబాబు వాహనానికి ఓ పక్కగా ఉండి దాడి చేశారు. ఆ దాడుల్లో రాయి తగిలిన ఓ వృద్ధుడు పది రోజుల పాటు ఆస్పత్రిలో ఉండి చనిపోయారు.
తర్వాత కృష్ణా జిల్లా నందిగామలోనూ ఇలాగే రాళ్లదాడి చేశారు. పోలీసులు నిలబడడిన ఓ వ్యూ పాయింట్ నుంచి నిలబడి రాళ్లేసినట్లుగా తెలిసింది. అప్పుడు ఎన్ ఎస్జీ సెక్యూరిటీ ఆఫీసర్ తలకే దెబ్బ తగిలింది. ఇవన్నీ యాధృచ్చికంగా చేస్తున్నవి కావని.. ఖచ్చితంగా చంద్రబాబును హానీ తలపెట్టేందుకు ప్రణాళిక ప్రకారం చేస్తున్నారని ఎన్ఎస్జీ అనుమానిస్తున్నట్లుగా తెలుస్తోంది.
చంద్రబాబు ఎక్కడికి వెళ్లినా స్థానిక పోలీసులు భద్రతా ఏర్పాట్లు నామమాత్రంగా చేయడమే కాదు కుట్రపూరితంగా దాడులు చేస్తున్న వారికి రక్షణగా ఉంటున్న విషయాలను కూడా నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ తమ నివేదికలో ఢిల్లీకి నివేదించినట్లుగా చెబుతున్నారు. ప్రతీ సారి రాళ్లు విసురుతున్న సమయంలో పోలీసులు చూసీ చూడనట్లుగా ఉంటున్నారు. ఎస్ఎస్జీ భద్రతా సిబ్బంది ప్రత్యేకంగా బుల్లెట్ ఫ్రూఫ్ .. రక్షణ పరికరాలు పెట్టుకుని వస్తున్నారు. ఈ నివేదిక ఢిల్లీకి చేరిందని తెలిసిన తర్వాతనే.. చంద్రబాబుపై హత్యాయత్నం కేసు పెట్టారన్న ప్రచారం జరుగుతోంది.
పుంగనూరులో అడ్డుకుంది వైసీపీ వాళ్లు.. దాడులు చేస్తామని హెచ్చరించింది వైసీపీ వాళ్లు.. అంగళ్లులో రాళ్ల దాడి చేసింది వైసీపీవాళ్లు.. పోలీసులు పట్టించుకోకపోతే తరమండి అని చంద్రబాబు అన్నారు. దాంతో తరిమేశారు. అప్పటికీ పోలీసులు పట్టించుకోలేదు. కానీ చంద్రబాబుతో పాటు టీడీపీ ముఖ్య నేతలందరిపైనా హత్యాయత్నం కేసులు పెట్టారు. ఈ వ్యవహారం ఇప్పుడు సంచలనం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకే చంద్రబాబు సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నారు.