దేశభక్తిని ఓట్లకు అమ్ముకోవడంలో బీజేపీని మించిన పార్టీ లేదు. ఇప్పుడు తెలంగాణలో ఆ పార్టీ ఆగస్టు 15ను విస్తృతంగా మార్కెటింగ్ చేసుకుంటోంది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని లక్ష్యంగా చేసుకుని వరుసగా జాతీయవాదాన్ని తట్టిలేపే కార్యక్రమాలకు రూపకల్పన చేసింది. అమరవీరుల స్మరణార్థం దేశ వ్యాప్తంగా మేరా మిట్టి రా దేశ్ కార్యక్రమం నిరవహిస్తోంది. ఆగస్టు 14న భారతదేశ విభజనను నిరసిస్తూ దేశ విభజన గాయాల సంస్మరణనను పెద్ద ఎత్తున నిర్వహించాలని నిర్ణయించింది.
మేరామిట్టి- మేరా దేశ్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణలో ఆగస్టు 15 వరకు వరుస కార్యక్రమాలను బీజేపీ రాష్ట్ర నాయకత్వం నిర్వహించనుంది. అధిష్టానం ఆదేశాలతో ఈ కార్యక్రమాన్ని పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రతి జిల్లాకు , ప్రతి అసెంబ్లి నియోజకవర్గానికి ప్రత్యేకంగా ఇద్దరేసి కో.ఆర్డినేటర్లను నియమించింది. ఇప్పటికే ఈ కార్యక్రమ నిర్వహణపై రాష్ట్ర స్థాయిలో కిషన్‌రెడ్డి అధ్యక్షతన వర్క్‌షాప్ కూడా జరిగింది. పోలింగ్ బూత్‌స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో , రాష్ట్ర స్థాయిలో ప్రచార కార్యక్రమాలను ప్లాన్ చేసుకుంటున్నారు. మఖ్యంగా స్వాతంత్ర్య ఉద్యమన్ని ఓన్ చేసుకునే ప్లాన్ చేసుకుంటున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతీ గ్రామానికి వెళ్లి జాతీయ జెండాలను ఎగురవేయడం, దేశ విభజన సమయంలో చోటు చేసుకున్న మారణకాండపై ప్రచారం, దేశ విభజన గాయాలకు చెందిన ఫోటోలు, ఫీల్మ్‌లను, నాటి వార్తా పత్రికల ప్రతులను ప్రదర్శనకు ఉంచనున్నారు. స్వాతంత్రాన్ని తెచ్చింది తామేనన్నట్లుగా ప్రచారం చేసుకునే ప్రయత్నంలో బీజేపీ చేస్తున్న ఈ ప్రయత్నాలు చాలా మందికి ఔరా అనిపిస్తోంది. మరి బీజేపీ అంటే అదేనని కొంత మంది నిట్టూరుస్తున్నారు.