సీఎం కేసీఆర్ పక్కా రాజకీయ వ్యూహంతో ఎన్నికలకు వెళ్తున్నారు. నా దగ్గర మీ అప్లికేషన్ ఉంది…. మీరు ఓటేయకపోతే అది పరిష్కారం కాదు అన్న ఓ సందేశాన్ని ఆయన ఓటర్లకు పంపబోతున్నారు. ఇందులో పథకాలే ఆధారం. ప్రతి పథకాన్ని ప్రకటించడం.. దరఖాస్తులు తీసుకోవడం కామన్ గా మారిపోయింది. అన్నీ లక్షలు ఇచ్చే పథకాలే. అవి కూడా ఉచితంగా .అందుకే లక్షల సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. అన్నింటినీ కాదనుకుండా తీసుకుంటోంది ప్రభుత్వం.
స్థలం ఉండి ఇళ్లు లేని పేదలకు రూ. మూడు లక్షలు ఇచ్చే గృహలక్ష్మి పథకాన్ని గత ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. ఈ ఎన్నికలకు ముందు దరఖాస్తులు తీసుకున్నారు. ఏకంగా పదిహేడు లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. పదిహేడు వందల మందికి ఇస్తారేమో కానీ.. మిగతా వాళ్లంతా ప్రభుత్వం వద్ద తమ దరఖాస్తు ఉందని.. ప్రభుత్వం మళ్లీ వస్తే తమకు డబ్బులిస్తుందని అనుకుంటారు. అలాంటి ఆశలు కల్పించడానికే దరఖాస్తులుతీసుకుంటున్నారు.
ఇప్పటి వరకూ దళిత బంధు, మైనార్టీ బంధు, బీసీ బంధు సహా అనేక పథకాల అప్లికేషన్లు తీసుకున్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల అప్లికేషన్ల గురించి చెప్పాల్సిన పని లేదు. కనీసం కోటి మంది ఓటర్లు.. ప్రభుత్వానికి ఆర్థిక సాయం కోసం.. పథకాలకోసం దరఖాస్తు చేసుకుని నిరీక్షిస్తూ ఉంటారు. వీరందరిలో కొంత మందికే ఎన్నికల్లోపు వస్తాయి… 95 శాతం మందికి ఎన్నికల్లోపు సాయం అందదు. అందుకే.. మంత్రులు మెంటల్ గా ప్రిపేర్ చేస్తున్నారు. ఈ పథకాలన్నీ నిరంతర ప్రక్రియ అని అందరికీ ఇస్తామని అంటున్నారు.
అయితే దరఖాస్తు దారులు నమ్మకం కోల్పోతే మాత్రం.. రియాక్షన్ డుబుల్ ఇంపాక్ట్ చూపిస్తుందన్న భయం… బీఆర్ఎస్లో ఉంది.